వ్యాపారాలు చేసుకోండి.. ప్రాణాలతో చెలగాటం ఆడితేనా: సినిమా వాళ్లకి సీఎం రేవంత్ వార్నింగ్
ABN, Publish Date - Dec 21 , 2024 | 04:56 PM
సినిమా వాళ్లకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఆయన సినిమా వాళ్లకు ఇచ్చిన వార్నింగ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంతకీ సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
సంధ్య థియేటర్ వద్ద అంత పెద్ద ఘటన జరిగి, ఓ తల్లి చనిపోయి, ఆ తల్లి కొడుకు హాస్పిటల్‌లో ఉంటే ఒక్కరంటే ఒక్కరైనా పరామర్శకు రాలేదు. తన కొడుకు ఆ హీరో అభిమాని అని తెలిసి.. తన శాలరీ కంటే ఎక్కువ పెట్టి టికెట్ల కొన్న ఆ కుటుంబ యాజమాని పరిస్థితిని పట్టించుకున్న వారు లేరు. సినిమా వాళ్లు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు తీసుకుని వారి వ్యాపారాలు చేసుకోవచ్చు. కానీ ప్రేక్షకుల, అభిమానుల ప్రాణాలతో చెలగాటం ఆడితే మాత్రం సహించం అంటూ.. సీఎం రేవంత్ రెడ్డి సినిమా వాళ్లకు వార్నింగ్ ఇచ్చారు.