Pushpa 2: పోలీసులకు ఛాలెంజ్ విసిరిన బన్నీ.. 'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'
ABN, Publish Date - Dec 24 , 2024 | 07:18 PM
Pushpa 2: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో 'పుష్ప 2' మూవీ నుండి ఓ సాంగ్ రిలీజ్ చేయడం ఆసక్తికరంగా మారింది. పోలీసులను, సీఎం ను ఛాలెంజ్ చేస్తూ 'దమ్ముంటే పట్టుకోరా షెకావత్' అంటూ సాగే పాటను తాజాగా రిలీజ్ చేశారు.
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప2’. రష్మిక కథానాయిక. డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో 'దమ్ముంటే పట్టుకోరా షెకావత్' ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీపరీతంగా ట్రెండ్ అవుతున్న ఈ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.