Prabhas: సారీ చెప్పిన ప్రభాస్..
ABN, Publish Date - Dec 18 , 2024 | 06:07 PM
రెబల్ స్టార్ ప్రభాస్ జపనీస్ భాషలో అదరగొట్టాడు.. ఆయన ఏం మాట్లాడాడో మీరే వినండి..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు (Prabhas) వచ్చే నెల జపాన్‌లో విడుదల కానున్న కల్కి ప్రమోషన్స్‌కు హాజరు కావాల్సి ఉంది. అయితే ఇటీవల జరిగిన ఓ గాయం కారణంగా ఆయన ప్రమోషన్స్‌కు హాజరు కాలేకపోతున్నారు. తాజాగా ఆయన జపాన్ ఆడియెన్స్ కోసం ఓ ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ప్రభాస్ పూర్తి జపనీస్‌లో మాట్లాడటం విశేషం. ప్రభాస్ మాట్లాడుతూ.. తాను అక్కడికి రాలేకపోతున్నానంటూ ఫ్యాన్స్‌కు ప్రభాస్ క్షమాపణలు చెప్పారు. కొత్త సినిమా షూటింగ్‌లో కాలికి స్వల్ప గాయమవ్వడం వల్ల ప్రస్తుతానికి రాలేకపోతున్నానని, త్వరలోనే కలుస్తానని ఫ్యాన్స్‌కు చెప్పారు. తాను ప్రస్తుతం బాగానే ఉన్నానని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Updated at - Dec 18 , 2024 | 06:07 PM