NTR Cine Vajrotsavam: ఘనంగా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు..
ABN, Publish Date - Dec 14 , 2024 | 06:31 PM
ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు విజయవాడలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకకి ముఖ్య అతిథులుగా ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సీనియర్ ఎన్టీఆర్ తొలి సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన కృష్ణవేణి ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. "తారకరమం" పేరుతో ఎన్టీఆర్ అంతరంగం పుస్తకాన్ని వజ్రోత్సవ వేడుకల్లో ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. పెద్దఎత్తున ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో ఏపీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరంతరం తనిఖీలు చేస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. అలాగే పెద్దఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎటువంటి సమస్యా తలెత్తకుండా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.