Apoorva Singeetham: 'అపూర్వ సింగీతం..' ఫస్ట్ ఎపిసోడ్

ABN, Publish Date - Dec 15 , 2024 | 10:42 AM

భారతీయ చలన చిత్ర పరిశ్రమలో గర్వించదగ్గ అతి కొద్దీ గొప్ప కళాకారులలో 'సింగీతం శ్రీనివాసరావు' ఒకరు. మూస పద్దతులలో సినిమాలు తీయకుండా ప్యారలల్, ప్రయోగాత్మక చిత్రాలకు ఆయన కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. కేవలం తెలుగు సినిమాలే కాకుండా తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఆయన గొప్ప చిత్రాలు నిర్మించారు. ఇక సకల కళా వల్లభుడు కమల్ హాసన్‌తో ఆయన బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సింగీతం సినీ పరిశ్రమకి అందించిన సేవలను గౌరవిస్తూ కమల్ హాసన్ తాజాగా ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. దీనికి సంబంధించిన మొదటి ఎపిసోడ్‌ని తాజాగా రిలీజ్ చేశారు. మీరు ఓ లుక్కేయండి.

Updated at - Dec 15 , 2024 | 10:42 AM