అల్లు అర్జున్ కాలు విరిగిందా? చెయ్యి విరిగిందా?: సీఎం రేవంత్
ABN, Publish Date - Dec 21 , 2024 | 03:54 PM
అల్లు అర్జున్ ఒక రోజు జైలుకి పోయినందుకు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆయన ఇంటిలో వాలిపోయింది.. కానీ అక్కడ తొక్కిసలాటలో బాధితులైన వారిని ఎవరైనా పోయి చూశారా? అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇటీవల సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటపై సీఎం రేవంత్ రెడ్డి శనివారం అసెంబ్లీలో షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఏమన్నారంటే..
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో కన్న బిడ్డ చేతిని పట్టుకుని ఓ తల్లి చనిపోయింది. ప్రస్తుతం ఆ బిడ్డ కోమాలో ఉండి చికిత్స పొందుతున్నాడు. వారిని పరామర్శించాల్సింది పోయి.. ఒక్క రోజు జైలుకి వెళ్లి వచ్చినందుకు అల్లు అర్జున్‌ని సినీ ప్రముఖులంతా వెళ్లి పరామర్శిస్తున్నారు. ఆయనకి ఏమైనా కాలు విరిగిందా? చేయి విరిగిందా? ఎందుకు పరామర్శిస్తున్నారు. బాధితులను ఆదుకోవడానికి సినీ ప్రముఖులు ఎవరూ ఆసక్తి చూపించలేదు. కానీ అల్లు అర్జున్ కోసం క్యూ కట్టిన సినీ ప్రముఖులు బాధితులను పరామర్శించడానికి ముందుకు రాలేదు. దీనిని బట్టి చూస్తుంటే అసలు సినీ ప్రముఖులు ఏం కోరుకుంటున్నారు అంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంకా ఆయన ఏమన్నారో పై వీడియోలో..