Bobby Deol: సందీప్ రెడ్డి పేరు ఎత్తితే ఎమోషనల్ అవుతున్న హీరో

ABN, Publish Date - Dec 27 , 2024 | 07:59 AM

Bobby Deol: ఒకప్పుడు తన మార్క్ సినిమాలతో బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన బాబీ డియోల్‌కి తర్వాత ఆఫర్లు రాలేదు. ఆ కష్ట సమయాల్లోనే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా యానిమల్‌తో లైఫ్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే బాబీ డియోల్ ఎమోషనల్ జర్నీపై ఓ లుక్కేదాం.

సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన 'యానిమల్'సినిమా బాలీవుడ్, టాలీవుడ్ లనే కాదు మొత్తం ఇండియానే షేక్ చేసింది. గుడ్ ఆర్ బ్యాడ్ అనేది పక్కన పెడితే ఈ సినిమా చూపించిన ప్రభావం మామూలుది కాదు. ఇక ఈ సినిమాలో ప్రతి ఒక యాక్టర్ తమ నట విశ్వరూపాలను చూపించారు. ప్రత్యేకంగా విలన్ పాత్రతో కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ కేవలం ప్రత్యర్థులనే కాదు ఆడియెన్స్ ని కూడా వణికించాడు. అయితే 'యానిమల్' మూవీ బాబీ సెకండ్ ఇన్నింగ్స్ కి పునాది వేసింది. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. 'యానిమల్'కి ముందు సినిమాలు లేక అనేక ఇబ్బందులు పడ్డాడట. తనకి అవకాశం ఇచ్చిన సందీప్ రెడ్డి పేరు ఎత్తితేనే ఎమోషనల్ అవుతున్నాడట.

Updated at - Dec 27 , 2024 | 08:02 AM