Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్ వీడియో చూశారా..
ABN, Publish Date - Dec 13 , 2024 | 01:35 PM
‘పుష్ప 2’ ప్రీమియర్ షో నిమిత్తం సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే యువతి మృతి చెందిన విషయం తెలిసిందే. రేవతి భర్త ఈ ఘటనపై కేసు ఫిర్యాదు చేయగా.. శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను విచారణ నిమిత్తం అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ అరెస్ట్ వీడియో ఇదే..
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ‘పుష్ప 2’ ప్రీమియర్ షో తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆమె భర్త భాస్కర్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు నేడు హీరో అల్లు అర్జున్‌ను (Allu Arjun Arrest) విచారణ నిమిత్తం అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తున్న వీడియో ఇదే.