Ram Charan: ‘గేమ్‌ ఛేంజర్‌’ నుంచి ‘దోప్‌’ సాంగ్ వచ్చేసింది

ABN, Publish Date - Dec 22 , 2024 | 12:46 PM

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘గేమ్‌ ఛేంజర్‌’ నుంచి మరో సాంగ్ విడుదలైంది. డల్లాస్‌లో ప్రీరిలీజ్‌ వేడుక సందర్భంగా ‘దోప్‌’ అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. తమన్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. తమన్‌, రోషిణి జేకేవీ, పృథ్వీ, శ్రుతి రంజని ఆలపించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ సంక్రాంతి కానుకగా జనవరి 10న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated at - Dec 22 , 2024 | 12:46 PM