Zarina Wahab: ప్రభాస్ లాంటి కొడుకు కావాలి..

ABN, Publish Date - Nov 28 , 2024 | 08:21 AM

మరో జన్మంటూ ఉంటె ప్రభాస్ లాంటి కొడుకుని కోరుకుంటా అని దేవర తల్లి చెప్పింది. దేవర తల్లి ప్రభాస్ గురించి చెప్పడం ఏంటి? ఎప్పుడు? ఎందుకు? అనుకుంటున్నారా? ఎందుకంటే..

రెబల్ స్టార్ ప్రభాస్.. ఎప్పటికి డార్లింగే అని మరోసారి ప్రూవ్ అయ్యింది. దేవర తల్లి ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. నేను ప్రభాస్ లాంటి కొడుకును కోరుకుంటానని చెప్పారు. ప్రభాస్ మంచితనం గురించి ఆమె వర్ణిస్తూ.. ఎంతో ఉత్సాహంగా మాట్లాడారు.


దేవర సినిమాలో ఎన్టీఆర్ తల్లిగా నటించిన హిందీ నటి జరీనా వాహబ్.. 'ది రాజా సాబ్' సినిమాలో ప్రభాస్ తల్లిగా నటిస్తున్నారు. తాజాగా ఆమె ఒక హిందీ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇస్తూ.. ప్రభాస్ గురించి చెబుతూ చాలా సంతోషానికి వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ.. 'ప్రభాస్ ఎంత గొప్ప మనిషి అంటే నేను ఇప్పటివరకు ఏ ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని చూడలేదు. సెట్‌లో ప్రతిఒక్కరిని వారి క్రాఫ్ట్స్‌తో సంబంధం లేకుండా సమానంగా చూసుకుంటారు. నాకు ఆకలేస్తుందని తెలిస్తే.. ఇంటికి ఫోన్ చేసి 40-50 మందికి ఫుడ్ తెప్పిస్తారు. వచ్చే జన్మలో ప్రభాస్ లాంటి కొడుకుకి తల్లి కావాలని కోరుకుంటా' అంది.


జరీనా వాహబ్ పేరుకి హిందీ యాక్టర్ అయినా.. ఆమె తెలుగింటి ఆడపడుచు. విశాఖపట్టణంలో పుట్టి పెరిగింది. తర్వాత బాలీవుడ్ యాక్టర్, ప్రొడ్యూసర్ ఆదిత్య పాంచోలిని పెళ్లి చేసుకుంది. హిందీ, తమిళ్, మలయాళ భాషలతో పాటు తెలుగులో గాజుల కిష్టయ్య, అమర ప్రేమ, హేమా హేమీలు, రక్త చరిత్ర 2, విరాట పర్వం, దేవర సినిమాల్లో నటించింది. ఆమెకి ఇద్దరు సంతానం కాగా ఒకరు బాలీవుడ్ హీరో సూరజ్ పాంచోలి.

Updated Date - Nov 28 , 2024 | 11:34 AM