Dasari Vignan: హర్ష సాయికి మద్దతు తెలిపిన ఫిల్మ్ క్రిటిక్ అరెస్ట్

ABN, Publish Date - Oct 08 , 2024 | 01:07 PM

ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి(Harsha Sai) కేసులో రోజుకో ట్విస్ట్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఈ యూట్యూబర్‌పై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు విడుదల చేశారు. అయితే ఈ అంశానికి సంబంధించి ఓ సినీ క్రిటిక్ యూట్యూబ్‌లో వరుసగా వీడియోలు చేస్తున్నాడు. ఆయన జుగుప్సాకరమైన ఫోటోలు, నీచమైన కామెంట్స్ చేస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇంతకీ ఆ ఫిల్మ్ క్రిటిక్ ఎవరంటే..

dasari kiran

ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి(Harsha Sai) కేసులో రోజుకో ట్విస్ట్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఈ యూట్యూబర్‌పై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు విడుదల చేశారు. అయితే ఈ అంశానికి సంబంధించి ఓ సినీ క్రిటిక్ యూట్యూబ్‌లో వరుసగా వీడియోలు చేస్తున్నాడు. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన అనేక వివాదాస్పద ఘటనలపై వీడియోలు చేస్తూ.. యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నాడు. అయితే ఈ ప్రసారాలలో ఫేక్ న్యూస్ ఎక్కువ ఉండటంతో పాటు నేరస్థులకు మద్దతు తెలుపుతున్నట్లు ఉందని పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఆయన జుగుప్సాకరమైన ఫోటోలు, నీచమైన కామెంట్స్ చేస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇంతకీ ఆ ఫిల్మ్ క్రిటిక్ ఎవరంటే..


దాసరి విజ్ఞాన్(Dasari Vignyan).. ఎప్పుడు వివాదాస్పద అంశాలపై యూట్యూబ్ లో విశ్లేషణలు చేస్తుంటారు. కవిత లిక్కర్ స్కాం కేస్ నుండి తాజా కొండా సురేఖ ఎపిసోడ్ వరకు అంతా కవర్ చేశారు. అయితే కవర్ చేయడం పర్వాలేదు.. కానీ అసత్య ప్రచారాలు, జుగుప్సాకరమైన ఫోటోలు, నీచమైన కామెంట్స్ చేస్తూ సినీ, రాజకీయ సెలబ్రిటీల ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు. మరోవైపు హర్ష సాయి కేస్‌లోను బాధితురాలిదే తప్పంటూ ఫేక్ ఆడియోస్, ఫేక్ సాక్షాలు ముందు పెట్టి వీడియోస్ చేశాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా సెక్షన్ 72 BNS, 356 (1) BNS 67 of IT Act 2008 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.


అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి హీరోయిన్లతో నిజంగానే సంబంధాలు ఉన్నాయంటూ కొన్నిఫేక్ ప్రూఫ్స్ నిజాలుగా ప్రచారం చేశారు. ఇంకా తిరుమల లడ్డూ వివాదం, నాగార్జున, కొండా సురేఖ ఎపిసోడ్ లలోను ఫేక్ న్యూస్ ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఇలాంటి ఫేక్ ఎనలిస్ట్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని క్రెడిబిలిటీ ఉన్న సోర్స్ నుంచే వార్తలు కన్స్యూమ్ చేయడం తప్పనిసరి అని పలువురు సూచిస్తున్నారు.

Updated Date - Oct 08 , 2024 | 01:07 PM