Prasad Behara: ఫేమ్ వచ్చింది.. కెరీర్ పోయింది
ABN, Publish Date - Dec 18 , 2024 | 05:29 PM
మంచి హిట్లు సాధించి కెరీర్ మలుపు తిరుగుతున్న దశలో ప్రముఖ యూట్యూబర్ ప్రసాద్ బెహరా నీచానికి దిగజారుడు.
ప్రముఖ యూట్యూబర్ ప్రసాద్ బెహ్ర అరెస్టయ్యారు. వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో ఓ యువతిని లైంగిక వేధింపులకు గురి చేయడం తో పాటు, పలు మార్లు అసభ్య పదజాలంతో దూషించినట్లు యువతి ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా షూటింగ్ సమయంలో యువతి ప్రైవేట్ భాగాలను తాకుతూ ప్రసాద్ బెహరా నీచంగా ప్రవర్తించాడని పేర్కొంది. దీంతో ప్రసాద్ బెహరా వేధింపులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసును నమోదు చేశారు. ఆయనపై 75(2),79,351(2)BNS సెక్షన్స్ కింద కేసు నమోదు అయ్యింది.