YO 10 : 10 జంటలు, 10 ప్రేమకథలతో ‘YO! 10’

ABN, Publish Date - Oct 28 , 2024 | 10:16 PM

యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్స్ కు ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. అలాంటి కథా కథనాలతో "YO! 10 ప్రేమకథలు" సినిమా రాబోతోంది.

yo 10

యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్స్ కు ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. అలాంటి కథా కథనాలతో "YO! 10 ప్రేమకథలు" సినిమా రాబోతోంది. ఈ చిత్రాన్ని పి సి క్రియేషన్స్ సమర్పణలో, మనూటైమ్ మూవీ మిషన్ సంస్థ నిర్మిస్తోండ‌గా. పది మంది పాపులర్ హీరో హీరోయిన్స్ నటించబోతున్నారు. గతంలో "కల", "అలా", "వెల్కమ్" , "స్విమ్మింగ్ ఫూల్" వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన‌ రచయిత, నంది అవార్డ్ గ్రహీత మనోహర్ చిమ్మని ద‌ర్శ‌కత్వం వ‌హించ‌నున్నాడు. తాజాగా ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ దర్శకులు వీరశంకర్, చంద్రమహేశ్ ముఖ్య అతిథులుగా పాల్గొనగా డైరెక్టర్ వీరశంకర్ మూవీ పోస్టర్ పై క్లాప్ కొట్టారు.

అనంతరం జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ వీరశంకర్, చంద్రమహేశ్, బాబ్జీ, దర్శకురాలు ప్రియదర్శినిలు మాట్లాడుతూ.. మనోహర్ చిమ్మని దర్శకుడిగా, రచయితగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన రాసిన సినిమా స్క్రిప్టు రచనాశిల్పం పుస్తకానికి నంది పురస్కారం దక్కింది. మనోహర్ రచనా శైలి ఆకట్టుకునేలా ఉంటుంది. దర్శకుడిగా "YO! 10 ప్రేమకథలు" సినిమాతో మరో మంచి ప్రయత్నం చేస్తున్నారు. మాములుగా సినిమాలో ఒక ప్రేమ కథ ఉంటుంది. కానీ ఈ సినిమాలో పది ప్రేమ కథల్ని తెరకెక్కించబోతుండటం ఆసక్తికరంగా ఉంది. ఈ మూవీ మనోహర్ గారికి దర్శకుడిగా మరింత మంచి పేరు తీసుకురావాలి. టీమ్ అందరికీ నా విశెస్ అందిస్తున్నామ‌న్నారు.

చిత్ర దర్శకులు మనోహర్ చిమ్మని మాట్లాడుతూ - యో... అనే మాట యువతకు ప్రతీక. ఈతరం యువతీయువకుల ఆలోచనలు, జీవనశైలి చుట్టూ అల్లిన 10 ప్రేమ కథల సమాహారం ఈ సినిమా. సుమారు 2 గంటల నిడివి ఉండే ఈ సినిమాలో 10 జంటలు, 10 ప్రేమకథలు ఒక్కో జానర్లో ఉంటాయి. వీట‌న్నింటికీ ఉన్న‌ లక్ష్యమే సినిమాను యువతరం ప్రేక్షకులకు కనెక్ట్ చేస్తుంది. సినిమాలో న‌టించే వారి వివరాలన్నీ తర్వాత ప్రకటిస్తామన్నారు. సినిమా షూటింగ్ నవంబర్ చివరివారంలో ప్రారంభించి వైజాగ్, గోవా, హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోని అద్భుతమైన లొకేషన్స్‌లో షూట్ చెయ్యబోతున్నామ‌న్నారు. ప్రారంభ వేడుకలో మీరు చూసిన ఇంట్రో వీడియో, ఈ సినిమా పోస్టర్ డిజైనింగ్‌ను ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఉపయోగించి చేశాం. ఈ సినిమాలోని ఇంక చాలా అంశాల్లో ఏఐని ఉపయోగిస్తున్నామ‌న్నారు.

Updated Date - Oct 28 , 2024 | 10:16 PM