మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Padamati Kondallo: ’పడమటి కొండల్లో‘.. హీరోయిన్ యశస్వి ఫస్ట్ లుక్ విడుదల

ABN, Publish Date - May 01 , 2024 | 07:49 PM

శ్రీదేవి క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న చిత్రం ‘పడమటి కొండల్లో’. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ యశస్వి శ్రీనివాస్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.

padamati kondallo

శ్రీదేవి క్రియేషన్స్ (sridevi creations) బ్యానర్ పై విన్విత ఎంటర్టైన్మెంట్స్ సమర్పణ ద్వారా జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా రూపొందుతున్న చిత్రం ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). ఈ సినిమాకి దర్శకత్వం వహించిన నరేష్ పెంట, సంగీతాన్ని కూడా అందించారు. ఈ సినిమాకి సంబంధించిన హీరో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవలే సాయిధరమ్ తేజ్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ యశస్వి శ్రీనివాస్ (Yashaswi Srinivas) ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. యశస్వి శ్రీనివాస్ ఈ సినిమాలో మైన అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఎర్ర రంగు చీరలో జుట్టు విరబోసుకుని చేతిలో కత్తి పట్టుకున్న కాళీమాత లాగా ఉన్న శ్రావ్య రెడ్డి ఫస్ట్ లుక్ సినిమా పైన అంచనాలను పెంచేస్తోంది.


"పడమటి కొండల్లో" (Padamati Kondallo) సినిమాతో సరి కొత్త ఎక్స్పీరియన్స్ ని ప్రేక్షకులు పొందుతారని, ఈ చిత్రానికి ఒక మార్క్ ఉంటుంది అని, భవిష్యత్తులో మరిన్ని అప్డేట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది.

Updated Date - May 01 , 2024 | 07:49 PM