Kalinga: ‘కిరోసిన్’ ధృవ వాయు హీరోగా‘కళింగ’.. ఫస్ట్ లుక్‌ని విడుదల

ABN, Publish Date - Jul 09 , 2024 | 06:53 PM

‘కిరోసిన్’ వంటి సూప‌ర్ హిట్ చిత్రం అనంత‌రం ధృవ వాయు హీరోగా తెర‌కెక్కుతున్న కొత్త సినిమా ‘కళింగ’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

kalinga

‘కిరోసిన్’ వంటి సూప‌ర్ హిట్ చిత్రం అనంత‌రం ధృవ వాయు హీరోగా తెర‌కెక్కుతున్న కొత్త సినిమా ‘కళింగ’(Kalinga). బిగ్ హిట్ ప్రొడక్షన్స్ (Big Hit Productions) బ్యానర్ మీద దీప్తి కొండవీటి (Deepthi Kondaveeti), పృథ్వీ యాదవ్ (Pruthivi Yadav) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ధృవ వాయు (Dhruva Vaayu) ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

లెజెండరీ రైటర్ వి విజయేంద్ర ప్రసాద్ ( VVijayendra Prasad) ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ని విడుదల చేసి టీంకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ (Mamidi HariKrishna) పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. కళింగ అనే టైటిల్‌, ఫస్ట్ లుక్ చూస్తుంటే ఏదో ఇంట్రెస్టింగ్‌ కాన్సెప్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతోన్నట్టుగా కనిపిస్తోందన్నారు


ఇదిలాఉండ‌గా.. పోస్టర్‌లో హీరో, అతని వెనకాల లక్ష్మీ నరసింహా స్వామి ఉగ్ర రూపంలో ఉన్న విగ్రహం, హీరో చేతిలోని ఆ కాగడ.. మొత్తం ఆ సెటప్‌ను చూస్తుంటే సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలా కనిపిస్తోంది. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని ఇవ్వబోతోందని ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చూస్తేనే అర్థం అవుతోంది.

ప్రస్తుతం ఆడియెన్స్ టేస్ట్‌కు త‌గ్గ‌ట్టుగా కొత్త కాన్సెప్ట్ బేస్డ్ చిత్రంగా ధృవ వాయు తీసుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో ప్రగ్యా నయన్ (Pragya Nayan) కథానాయికగా నటిస్తుండగా, ఆడుకాలం నరేన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అక్షయ్ రామ్ పొడిశెట్టి సినిమాటోగ్రఫీని, విష్ణు శేఖర, అనంత నారాయణన్ ఎజి సంగీతం అందిస్తున్నారు. నరేష్ వేణువంక ఎడిటర్.

Updated Date - Jul 09 , 2024 | 06:56 PM