Biggboss 8 Telugu: బిగ్‌బాస్.. పృధ్వీ , విష్ణుప్రియ మధ్య అస‌లేం న‌డుస్తోంది

ABN, Publish Date - Oct 23 , 2024 | 12:46 PM

బిగ్‌బాస్ షో రోజురోజుకు తీసిక‌ట్టుగా మారుతుంది. సీజ‌న్ సీజ‌న్‌కు వ‌స్తున్న కంటెస్టెంట్ల రెడీమేడ్ ఆట‌తీరు, టీఆర్పీల కోసం యాజ‌మాన్యాలు చేస్తున్న మార్పులు, ప్ర‌వ‌ర్తిస్తున్న తీరు దానికున్న ప్రాధాన్య‌త‌ను మ‌స‌క‌బారేలా చేస్తున్నాయి.

Vishnu Priya

బిగ్‌బాస్ (Biggboss 8 Telugu) షో రోజురోజుకు తీసిక‌ట్టుగా మారుతుంది. సీజ‌న్ సీజ‌న్‌కు వ‌స్తున్న కంటెస్టెంట్ల రెడీమేడ్ ఆట‌తీరు, టీఆర్పీల కోసం యాజ‌మాన్యాలు చేస్తున్న మార్పులు, ప్ర‌వ‌ర్తిస్తున్న తీరు దానికున్న ప్రాధాన్య‌త‌ను మ‌స‌క‌బారేలా చేస్తున్నాయి. ముఖ్యంగా బిగ్ బాస్ షోలో ఆట కంటే కంటెస్టెంట్స్ న‌డునుతున్న‌ వ్యవహారాలకు ప్రాధాన్యత ఎక్కువగా కనిపిస్తొంది. ప్రతి సీజన్‌లోనూ ఏదో ఒక ప్రేమ జంటను హౌస్‌లో ప్రొజెక్ట్ చేస్తుంటారు నిర్వాహకులు. ఎవరు ఎవరితో క్లోజ్‌గా ఉండాల‌నే కాన్సెప్ట్ ను ముందే ప్లాన్ చేసి కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపిస్తుంటారనే విమర్శలున్నాయి. అందుకు తగ్గట్టే కొన్ని జంటలు హద్దులు దాటి మరీ ప్రవర్తించడం జరుగుతోంది.

కాగా ఈ సీజన్‌లో పృధ్వీ (Prithvi), విష్ణుప్రియ (Vishnupriya) మధ్య ఎదో వ్యవహారం నడుస్తుందనట్లు హైలైట్ చేస్తున్నారు. విష్ణు ప్రియ మరీ గారాలు పోతే , పృధ్వీ ఆమెని సముదాయించటం మొదటి నుంచి నడుస్తోంది. చూడ్డానికి అది ఎబ్బెట్టుగా, చిరాగ్గా కూడా ఉంటోంది.ఇదిలాఉండ‌గా లేటెస్ట్ ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్స్ లో పలువురు కంటెస్టెంట్లు, విష్ణు ప్రియ పృధ్వీ మధ్య వ్యవహారంపై కామెంట్స్ చేశారు. వారి ముతక కెమిస్ట్రీని ప్రస్తావిస్తూ.. ఇద్దరిని విడివిడిగా కొందరు నామినేట్ చేయడమూ జరిగింది. నామినేషన్ల పర్వం ముగిశాక, వారి వ్యవహారం గురించి యష్మి నేరుగా పృధ్వీనే అడగగా నేను ఆమె వద్దకు వెళ్ళను ఆమె మాత్రం వస్తుందని పృధ్వీ తెలిపాడు. తాను అందరితో ఉన్నట్లే విష్ణు ప్రియతోనూ అలానే ఉంటానని తేల్చేశాడు పృధ్వీ.

ఆపై పృధ్వీ విష్ణు ప్రియ వద్దకు వెళ్లి మరీ మనిద్ధరి మధ్యా వేరే ఏదీ లేదు కదా..అని అడిగేసరికి విష్ణు ప్రియ షాక్‌కి గురైంది. ఏమీ లేదు..అని మొహమాటంగానే విష్ణు ప్రియ చెప్పేసి, పృద్వీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ఇలా ఈ బిగ్ బాస్ ఫేక్ ప్రేమల వ్యవహారం తో యువతకు బిగ్ బాస్ నిర్వాహకులు ఏం మెసెజ్ ఇవ్వాలనుకుంటున్నారనేది అర్దం కావట్లేదు.

గతంలో ష్మణుక్ ,సిరి ఎవరికి వారే పర్సనల్ రిలేషన్ షిప్‌లో ఉన్నా.. హౌస్‌లో వారి మధ్య ఎదో బాండింగ్‌ను క్రియేట్ అయినట్లు చూపారు. తీరా బ‌య‌ట‌కు వ‌చ్చాక ష‌ణ్ముక్‌కు త‌న ప్రేయ‌సితో బ్రేక‌ప్ చేసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది కూడా. షోలో దమ్ములేనప్పుడు.. కంటెస్టెంట్స్ మధ్య ఈ తరహా వ్యవహారాలను హైలైట్ చేయటం.. అది కూడా ఫ్యామిలీ రియాల్టీ షో పేరుతో చీప్ ట్రిక్స్ ను ప్లే చేయటం వల్ల రానూ రానూ బిగ్ బాస్ (Biggboss 8 Telugu) ప్రాభవం తగ్గిపోతూ వస్తుందనే కామెంట్స్ అధికంగా వినిపిస్తున్నాయి.

Updated Date - Oct 23 , 2024 | 12:46 PM