Mechanic Rocky : విశ్వక్ సేన్ మొదలు పెట్టాడు

ABN, Publish Date - Aug 19 , 2024 | 03:42 PM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak sen) తన అప్ కమింగ్ మూవీ 'మెకానిక్ రాకీ'తో (Mechanic Rocky) ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమౌతున్నారు.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak sen) తన అప్ కమింగ్ మూవీ 'మెకానిక్ రాకీ'తో (Mechanic Rocky) ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమౌతున్నారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందించారు. ఈ చిత్రానికి రవితేజ ముళ్లపూడి రచన, దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి తన SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు.  ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గేర్‌, ఫస్ట్ సింగల్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సోమవారం  సినిమా డబ్బింగ్ మొదలైంది. (Mechanic Rocky dubbing)

దీనికి సంబందించిన ఫోటోలను చిత్ర బృందం విడుదల చేసింది.  అక్టోబర్ 31న దీపావళికి విడుదల కానుంది . మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి జెక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. మనోజ్ కటసాని సినిమాటోగ్రఫీ. అన్వర్ అలీ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. 

Updated Date - Aug 19 , 2024 | 04:05 PM