మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Vishwak Sen: ఎంత తొక్కినా రెట్టింపు ఉత్సాహంతో పైకి లేస్తాను!

ABN, Publish Date - Mar 12 , 2024 | 04:18 PM

విశ్వక్‌సేన్  హీరోగా తెరకెక్కిన చిత్రం ‘గామి’. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుని  మంచి కలెక్షన్లు రాబడుతోంది.

విశ్వక్‌సేన్ (Vishwak sen) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘గామి’ (Gaami). ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుని  మంచి కలెక్షన్లు రాబడుతోంది. అయితే, సినిమా విడుదలైనప్పటి నుంచి కొందరు తక్కువ రేటింగ్‌ ఇస్తున్నారని చిత్రబృందం పోస్ట్‌లు పెడుతోంది. ఈ వ్యవహారంపై విశ్వక్‌ ఇన్ స్టా వేదికగా స్పందించారు. ఈ మేరకు ఓ నోట్‌ విడుదల చేశారు.

‘‘గామి’ని ఇంతపెద్ద హిట్‌ చేసినందుకు ప్రేక్షకులకు, సినీ ప్రియులకు  ధన్యవాదాలు. దీని రేటింగ్‌ విషయంలో నా దృష్టికి వచ్చిన సమస్య గురించి మాట్లాడాలనుకుంటున్నా. కొందరు ఈ చిత్రానికి 10కు 1 రేటింగ్‌ ఇచ్చి దెబ్బతీయాలని చూస్తున్నారు. రకరకాల యాప్స్‌ సహకారంతో ఫేక్‌ రేటింగ్‌ ఇవ్వడం వల్ల 9 ఉన్న రేటింగ్‌ ఒకటికి పడిపోయింది. మీరు ఎన్నిసార్లు  కిందికి లాగినా రెట్టింపు ఉత్సాహంతో పైకి లేస్తాను. ఇలాంటి పనులు ఎవరు, ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు. కానీ, ఎలాంటి సందర్భంలోనైనా మంచి సినిమాను ప్రేక్షకులు  ఆదరిస్తారని మరోసారి రుజువైంది. ‘గామి’ని సపోర్ట్‌ చేస్తోన్న ప్రేక్షకులకు, మీడియాకు థ్యాంక్స్‌. ఈ వ్యవహారంపై చట్టపరంగా ముందుకు వెళ్తాను’ అని రాసుకొచ్చారు.  విశ్వక్‌ అఘోరాగా కనిపించిన ఈ చిత్రంతో విద్యాధర్‌ కాగిత దర్శకుడిగా పరిచయం అయ్యారు. 

Updated Date - Mar 12 , 2024 | 04:18 PM