Vishwak Sen: ప్రాణానికి ప్రమాదం అని తెలిసి కూడా సాహసం చేశా.. ఇప్పుడైతే..!
ABN, Publish Date - Mar 03 , 2024 | 12:09 PM
ఈ సినిమాకి నేను చేసిన సపోర్ట్ రెమ్యునిరేషన్ తీసుకోకపోవడం. మొదట రోజు సెట్‌లో ఎలాంటి లైఫ్ స్టయిల్‌లో వున్నానో ఆరు నెలల క్రితం షూట్‌కి వెళ్ళినప్పుడు కూడా అలానే వున్నాను. డెబ్బై రోజులు ఈ సినిమా కోసం పని చేశాను. నిజంగా ఈ సినిమా షూటింగ్ ఒక సాహసమే’’ అని విశ్వక్ సేన్ అన్నారు.
"ఈ సినిమాకి నేను చేసిన సపోర్ట్ రెమ్యునిరేషన్ తీసుకోకపోవడం. మొదట రోజు సెట్‌లో ఎలాంటి లైఫ్ స్టయిల్‌లో వున్నానో ఆరు నెలల క్రితం షూట్‌కి వెళ్ళినప్పుడు కూడా అలానే వున్నాను. డెబ్బై రోజులు ఈ సినిమా కోసం పని చేశాను. నిజంగా ఈ సినిమా షూటింగ్ ఒక సాహసమే’’ అని విశ్వక్ సేన్ అన్నారు. ఆయన కథానాయికుడిగా నటించిన చిత్రం 'గామి’; విద్యాధర్ కాగిత దర్శకుడు. కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి కథానాయిక. క్రౌడ్ ఫండ్‌తో వి సెల్యూలాయిడ్ సమర్పణలో ఈ చిత్రం విడుదల కానుంది. మార్చి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా విశ్వక్‌సేన విలేకర్లతో మాట్లాడారు.
ఈ తరహా చిత్రం ఎవరూ చేయలేదు..
"నేను చేసిన ‘వెళ్లిపోమాకే’ సినిమా చూసి విద్యాధర్ నన్ను సంప్రదించారు. అప్పటికి ‘ఈ నగరానికి ఏమైయింది’ రిలీజ్ కాలేదు. తను కథ చాలా పెద్ద కాన్వాస్‌లో రాసుకున్నాడు. ఈ కథని తీయగలడనే నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ లోకి వెళ్లాను. ఆ సినిమాకి ఐదేళ్ళు పడుతుందని నాకు ముందే తెలుసు. ఒకవేళ ఏడాదిలో తీయాలనుకుంటే వందకోట్ల పైగా బడ్జెట్ అవుతుంది. వారణాసి, కుంభమేళలో గొరిల్లా షూట్ చేయగలిగాం. అలా బడ్జెట్ కలిసొచ్చింది. సమయమే దీనికి పెద్ద పెట్టుబడి. ఎప్పుడు వచ్చినా కొత్తగా వుండే సినిమా ఇది. ఎందుకంటే ఈ తరహాలో ఇప్పటివరకు ఎవరూ తీయలేదు. ఎప్పుడు వచ్చినా అద్భుతమైన క్యాలిటీతో రావాలని ముందే నిర్ణయించుకున్నాం. లేట్ అయినా సరైన టైమ్‌లోనే వస్తుంది. ఇప్పుడు నాకున్న ఇమేజ్‌ని బట్టి ఎలాంటి మార్పులు చేయలేదు. అలా చేస్తే సినిమా చెడిపోతుంది. ఆ మీటర్‌లో లెక్కలు వేసుకొని చేసిన సినిమా కాదు.’’
స్క్రీన్ ప్లే ఊపిరాడనివ్వదు...
నా సినిమా అంటే ప్రేక్షకులు కొన్ని ఆశిస్తారు. అవన్నీ లేని చిత్రమిది. కానీ ఓ కొత్త పాయింట్ కనిపిస్తుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా బ్లాక్ బస్టర్ అయ్యే సినిమాలు చాలా వున్నాయి. ‘తుంబాద్’ సినిమాలో కూడా ఎలాంటి హంగులు వుండవు. కానీ కథలో లీనమైపోతాం. గామి చాలా ఎమోషనల్ ఫిల్మ్. క్యారెక్టర్స్‌కి కనెక్ట్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే మొత్తం ఊపిరాడనివ్వదు. ఈ సినిమాకి పెద్ద కమర్షియల్ ఎలిమెంట్ ఎమోషన్. ఖచ్చితంగా ఇంటర్నేషనల్ స్థాయిలో క్రిస్టఫర్ నోలన సినిమా చూసిన అనుభూతి కలుగుతోంది.
చదువుతుంటే భయం వేసింది..
విద్యాధర్ షూటింగ్ ముందు స్క్రిప్ట్ అంతా చదవాలని చెప్పాడు. చదువుతున్నప్పుడే అసలు దీన్ని ఎలా తీయగలమనే భయం వేసింది. ఈ సినిమా కోసం దర్శకుడు ఓ మూడేళ్ళు ముందుగానే ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకున్నాడు. దాదాపు తొమ్మిదేళ్ళు ఈ సినిమాతోనే వున్నాడు. తను అనుకున్న సినిమాని అనుకున్నట్లు తీయాలంటే ఎలాంటి రిసెర్చ్ చేయాలో ముందుగానే చేసుకున్నాడు. ఈ సినిమా టీం మొత్తం పది శాతం అయితే 90 శాతం కష్టం దర్శకుడిదే. ఈ పూర్తిగా దర్శకుడి చిత్రం. నేను ప్రతి సినిమాకి ఒకలానే కష్టపడతా. ప్రాణం పెట్టి పని చేస్తా. గామికి ఎంత కష్టపడ్డానో గ్యాంగ్స్ అఫ్ గోదావరి, మెకానిక్ రాఖీ చిత్రాలకు అంతే కష్టపడ్డాను. ఇవన్నీ గేమ్ ఛేంజర్స్ గానే భావిస్తాను.
డన్‌కిర్క్ స్టయిల్‌లో..
లుక్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాం. పదిహేను రోజులకు ముందే షూటింగ్ గురించి తెలిశాక మెల్లగా ఆ లుక్ లోకి రావడానికి ప్రిపేర్ అయ్యేవాడిని. అఘోర పాత్ర కోసం దర్శకుడు కావాల్సిన రిసెర్చ్ ఇచ్చారు. కుంభమేళాలో అయితే కొన్ని లక్షల మంది అఘోరాలు ఉంటారు. వారిలో కలిసిపోయి ఉండేవాడిని. నా స్టయిల్‌లో ఎక్స్ ఫ్లోర్ చేసుకుంటూ వెళ్లాను. నిజంగా నేను అఘోరా అనుకోని చాలా మంది దానాలు చేశారు. ఈ సినిమా ప్రతి రోజు ఒక సవాలే. మైనస్ 30 డిగ్రిల్లో షూట్ చేశాం. కాళ్ళు చేతులు గడ్డలు కట్టేసేవి. నిజంగా అవి తచుకుంటే ఇంత రిస్క్ చేశామా అనిపిస్తుంది. ఇప్పుడు చేయమంటే మాత్రం చేయను. ఈ సినిమా స్క్రీన్ ప్లే మాత్రం డన్‌కిర్క్ స్టయిల్‌లో వుంటుంది. సినిమా చూస్తున్నపుడు ఈ స్క్రీన్ ప్లేని చాలా ఎంజాయ్ చేస్తారు . సెకండ్ హాఫ్ మైండ్ బ్లోయింగ్ గా వుంటుంది. ఇందులో నా పాత్రకు డైలాగ్స్ తక్కువ వుంటాయి. కంప్లీట్ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా వుంటుంది. చాందిని, అభినయ ఇలా అందరి పాత్రల్లో డెప్త్ వుంటుంది. ప్రతి పాత్ర ప్రత్యేకమే!
ఆ ఫార్మాట్లో మొదటి సినిమా ఇదే...
ఈ సినిమాకి నేను చేసిన సపోర్ట్ రెమ్యునిరేషన్ తీసుకోకపోవడం. దాంతో వాళ్ళకి బర్డెన్ కాలేదు. మొదట రోజు సెట్‌లో ఎలాంటి లైఫ్ స్టయిల్‌లో వున్నానో ఆరు నెలల క్రితం షూట్‌కి వెళ్ళినప్పుడు కూడా అలానే వున్నాను. డెబ్బై రోజులు ఈ సినిమా కోసం పని చేశాను. నిజంగా ఈ సినిమా షూటింగ్ ఒక సాహసమే. మంచు పడితే ప్రాణానికే ప్రమాదం అని తెలిసి కూడా షూటింగ్‌కి వెళ్ళేవాళ్ళం. ప్రస్తుతం తెలుగు రిలీజ్‌పై దృష్టి పెట్టాం. సినిమాని పీసిఎక్స్ ఫార్మెట్‌లో రిలీజ్ చేస్తున్నాం. మన దగ్గర నాలుగు స్క్రీన్స్ ఉన్నాయి. ఒక తెలుగు సినిమా ఈ ఫార్మెట్‌లో రావడం ఇదే మొదటి సారి. ఈ రెండు నెలల్లో రెండు చిత్రాలు వస్తున్నాయి. హిమాలయాల నుంచి గోదావరికి వెళ్లి మళ్ళీ మలక్‌పేట్‌కి వచ్చేస్తా. లైలా చిత్రం మేలో మొదలవుతుంది. ఆ చిత్రంలో ద్వితీయార్థం అంతా అమ్మాయిలా కనిపిస్తా. తదుపరి సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నాను.