Biggboss 8: విష్ణుప్రియ ఎలిమినేషన్‌ కారణం ఏంటో తెలుసా.. 

ABN, Publish Date - Dec 09 , 2024 | 08:37 AM

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 8 (Biggboss8) చివరి దశకు చేరుకుంది. ఫన్‌, ట్విస్ట్‌, టర్న్‌లతో మొదలైన ఈ షోకు నాగార్జున్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ (Double elimination) జరగ్గా, శనివారం రోహిణి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆదివారం విష్ణు ప్రియ బైబై చెప్పింది.

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 8 (Biggboss8) చివరి దశకు చేరుకుంది. ఫన్‌, ట్విస్ట్‌, టర్న్‌లతో మొదలైన ఈ షోకు నాగార్జున్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ (Double elimination) జరగ్గా, శనివారం రోహిణి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆదివారం విష్ణు ప్రియ బైబై చెప్పింది. బిగ్‌బాస్‌ హౌస్‌లో అత్యంత నిజాయతీ ఉన్న కంటెస్టెంట్‌ విష్ణు ప్రియ(9Vishnu Priya) ఎలిమినేట్‌ అయినట్లు ఆదివారం ఎపిసోడ్‌లో వ్యాఖ్యాత నాగార్జున వెల్లడించారు. చివరి వరకూ ఉత్కంఠ సాగగా అతి తక్కువ ఓట్ల రావడంతో విష్ణు ప్రియ ఇంటి నుంచి వెళ్తున్నట్లు నాగార్జున తెలిపారు. దీంతో ఈ సీజన్‌లో   నబీల్‌, నిఖిల్‌, ప్రేరణ, గౌతమ్‌, అవినాష్‌లు టాప్‌-5లో నిలిచారు.

ప్రస్తుతం బిగ్‌బాస్‌-8 టైటిల్‌ (Biggboss Season 8) ఫైట్‌లో ఈ ఐదుగురు తలపడనున్నారు. ఎలిమినేట్‌ అయ్యి స్టేజ్‌ మీదకు వచ్చిన విష్ణు ప్రియను.. మీ తండ్రి హౌస్‌లోకి రావడం ఎలా అనిపించింది? అని నాగార్జున అడగ్గా, ‘‘ఆడపిల్ల పుట్టడం వల్ల మా నాన్న అంత సంతోషంగా లేరని చిన్నప్పుడు మా అమ్మ చెబుతూ ఉండేది. ఈ రోజు ఇంత పెద్ద ఫ్లాట్‌ఫామ్‌పై మా నాన్నను అందరికీ పరిచయం చేయడం నాకు గర్వంగా ఉంది. అమ్మ కూడా సంతోషపడుతుంది’’ అని చెప్పుకొచ్చింది. ట్రోఫీకి దగ్గరగా ఉన్న వాళ్లెవరో చెప్పమని అడగ్గా, నిఖిల్‌కు ఎక్కువ అవకాశాలున్నాయని, ఒక మహిళా కంటెస్టెంట్‌ అయిన ప్రేరణ కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఇక మూడో స్థ్థానంలో నబీల్‌, ఆ తర్వాత అవినాష్‌, గౌతమ్‌ ఉంటారని తెలిపింది. సెప్టెంబరు ఒకటో తేదిన మొదలైన బిగ్‌బాస్‌ సీజన్‌-8లో మొదట 14 మంది కంటెస్టెంట్‌లు వెళ్లారు. వైల్డ్‌కార్డ్‌ ద్వారా మరో 8మంది హౌస్‌లోకి అడుగు పెట్టారు. వీరిలో నబీల్‌, నిఖిల్‌, ప్రేరణ, గౌతమ్‌, అవినాష్‌లు ఫైనలిస్ట్‌లు అయ్యారు. ఈ సారి విన్నర్‌ అయ్యే వ్యక్తి ట్రోఫీ, ప్రైజ్‌ మనీతోపాటు మారుతీ సుజుకీ ఆల్‌ న్యూ డ్యాజిలింగ్‌ డిజైర్‌ కారును కూడా సొంతం చేసుకోనున్నారు. 

అయితే ఎలిమినేట్‌ అయిన విష్ణు ప్రియ పారితోషికం  ఇప్పుడు టాపిక్‌గా మారింది. వారానికి రూ.4 లక్షలు చొప్పున విష్ణు ప్రియ వారానికి నాలుగు లక్షలు చొప్పున రెమ్యూనరేషన్ పొందినట్లు తెలుస్తోంది. అంటే.. 14 వారాలకు గాను రూ. 56 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ టైటిల్ గెలవకుండా.. భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుటాక్.. కానీ, ఈ సీజన్‌ లో లేడీ విన్నర్‌ అయ్యే ఛాన్స్‌ విష్ణుకు ఉందని అందరు భావించారు. కానీ ఆమె లవ్ అంటూ  ఆట మీద దృష్టి  పెట్టలేదు. ఆ కారణంతోనే టైటిల్ము  చేతులారా నాశనం చేసుకుందనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి.

Updated Date - Dec 09 , 2024 | 08:37 AM