Tollywood - Vinayaka Chavithi: దండాలయ్యా.. ఉండ్రాలయ్యా.. కరుణించయ్యా దేవా..
ABN, Publish Date - Sep 06 , 2024 | 04:02 PM
హిందువుల ఆది దైవం, విఘ్నాలకు అధిపతి వినాయక చవితి భారతీయులకు అతి ముఖ్యమైన పంపండుగ. లయకారుడు పరమేశ్వరుడు, పార్వతిల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకొంటారు.
హిందువుల ఆది దైవం, విఘ్నాలకు అధిపతి వినాయక చవితి (Sri Vinayaka Chavithi) భారతీయులకు అతి ముఖ్యమైన పంపండుగ. లయకారుడు పరమేశ్వరుడు, పార్వతిల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. వినాయకుడు.. విఘ్నాధిపతి.. గణనాథుడు.. బొజ్జ గణపయ్య.. ఏకదంతుడు.. లంబోధరుడు ఇలా ఏ పేరుతో స్వామిని కొలిచినా సకల విఘ్నాలు తొలగి విజయం చేకూరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఏ కార్యక్రమం చేప్పటినా తొలుత పూజించేది ఆది గణపతినే. తొలి టెంకాయ ఆయనకే! ఆ పదకొండు రోజులపాటు సాగే వినాయక చవితి వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త సందడి మొదలవుతుంది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఇలా ఎక్కడ చూసినా గణేష్ పాటలతో సందడి మొదలవుతుంది. ప్రతి గల్లీలోని ఒక విఘ్నేశ్వరుడు వెలుస్తాడు. ఆ లంబోదరుడి సేవలో నిమగ్నమైపోతారు. గణనాథుడిని ప్రతిష్టించడం దగ్గర నుంచి నిమజ్జనం చేసేంత వరకు చిన్నా పెద్దా చాలా బిజీ అయిపోతారు. సెంటిమెంట్లు ఎక్కువగా కనిపించే సినీ ఇండస్ట్రీలో (Tollywood) దైవభక్తి కూడా ఎక్కువే! తెలుగు సినిమాల్లోను వినాయకుడికి ప్రత్యేక స్థానం. సినిమా ప్రారంభానికి కొబ్బరికాయ కొట్టింది మొదలు.. గుమ్మడికాయ కొట్టే వరకూ ఎలాంటి విఘ్నాలు లేకుండా అంతా సజావుగా సాగాలని విఘ్నేశ్వరుడిని పూజిస్తారు. వినాయకుడి నేపథ్యంలో టాలీవుడ్లో ఎన్నో సినిమాలు వచ్చి, విజయాలు సాధించాయి. మరెన్నో చిత్రాల్లో స్వామిని కీర్తిస్తూ వచ్చిన సన్నివేశాలు, పాటలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. గణనాథుడి నేపథ్యంలో వచ్చిన కొన్ని సినిమాలు పాటలపై ఓ లుక్కేద్దాం.
వినాయక చవితి (Vinayaka Chavithi)
వినాయక చవితి రోజున వినాయక వ్రత కథ చదువుకుని, పూజ చేసుకోవడం ఆనవాయితీ. ఈ కథ ఆధారంగా సముద్రాల రాఘవాచార్య దర్శకత్వం వహించిన చిత్రం ‘వినాయక చవితి’. ఎన్టీఆర్, జమున, కృష్ణకుమారి, గుమ్మడి, రాజనాల తదితరులు నటించారు. కె. గోపాలరావు నిర్మించిన ఈ సినిమా 1957 ఆగస్టు 22న విడుదలైంది. ఇక ఈ చిత్రకథ విషయానికి వస్తే.. వినాయక చవితి నాడు శ్రీకృష్ణుడు పాలలో చంద్రుని చూడటంవల్ల సత్రాజిత్తు సంపాదించిన శమంతకమణిని అపహరించాడన్న అపఖ్యాతి మూటగట్టుకుంటాడు. ఆ తర్వాత వినాయక వ్రతం ఆచరించి, నిర్దోషిగా తనను తాను నిరూపించుకుని బయటపడతాడు. అందరూ చవితి నాడు వినాయక వ్రతం ఆచరిేస్త, ఆ గజానుని ఆశీస్సు?తో ఎలాంటి నీలాప నిందలపాలు కాకుండా ఉంటారనే కథతో ‘వినాయక చవితి’ చిత్రాన్ని రూపొందించారు.
భూ కైలాస్.. (Bhu kailash)
లయకారుడు శివుడి భక్తుడు రావణాసురుడు తన తల్లి కోరిక మేరకు శివుని ఆత్మలింగం తెస్తానని శపథం చేసి తపస్సుకు వెళ్తాడు. ఆత్మలింగం సాధించి అమరత్వం పొందాలన్నది రావణాసురుడి కోరిక. ఆయన తపస్సును మెచ్చుకున్న శివుడు ఆత్మలింగం ఇస్తూ, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై పెట్టకూడదని షరతు విధిస్తాడు. రావణాసురుడకి అమరత్వం వస్తే భూమండలం సర్వనాశనం అవుతందని నారదుడు ఆత్మలింగం లంకకు చేరకుండా అడ్డుకోవాలని వినాయకుణ్ణి ప్రార్థిస్తాడు. రావణాసురుడు సంధ్య వందనం చేేస సమయంలో శివుడి ఆత్మలింగం రావణుడి పాలు కాకుండా చేస్తాడు వినాయకుడు. చివరకు ఆత్మార్పణకు సిద్థపడిన రావణాసురుణ్ణి పరమేశ్వరుడు కరుణించి, ఆ ప్రదేశం ‘భూకైలాసంగా మారుతుందని చెప్పి అనుగ్రహించడంతో కథ ముగుస్తుంది. ఎన్టీఆర్ రావణునిగా, ఏఎన్నార్ నారదుడిగా నటించిన ‘ భూ కైలాస్’ చిత్రకథ ఇది. కె. శంకర్ దర్శకత్వంలో ఏవీఎం సంస్థ నిర్మించిన ఈ సినిమా 1958 మార్చి 20న రిలీజైంది.
శ్రీ వినాయక విజయం (Sri Vinayaka vijayam)
వినాయకుడి జీవిత చరిత్రపై తెలుగులో పూర్తి స్థాయిలో వచ్చిన చిత్రం ‘శ్రీ వినాయక విజయం’. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృష్ణంరాజు, వాణిశ్రీ శివ పార్వతులుగా నటించారు. శివదీక్షా వ్రతాన్ని ఆచరించడానికి పూనుకుని స్నానమాచరించబోతూ పిండితో ఒక బాలుని బొమ్మ తయారు చేసి, దానికి ప్రాణం పోసి, కాపలాగా ఉంచుతుంది పార్వతీదేవి. అదే సమయంలో అకం్కడికి వచ్చిన శివుణ్ణి లోనికి అనుమతించడు ఆ బాలుడు. ఆగ్రహించి బాలుని శిరస్సు ఖండిస్తాడు శివుడు. దీంతో పార్వతి తన బిడ్డను ఎలాగైనా బతికించమని శివుణ్ణి కోరుతుంది. ఆ బాలునికి ఏనుగు తలను అమర్చి ప్రాణం పోస్తాడు శివుడు. ఆ బాలుడు మూషికాసురున్ని సంహరించిన తీరు, మూషికాసురుని జన్మ వృత్తాంతం వంటి ఎన్నో విషయాలను ఈ సినిమాలో చూపించారు. 1979 డిసెంబరు 22న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమా వచ్చి 45 వసంతాలు దాటుతున్నా.. ఇప్పటికీ వినాయక చవితి రోజు ప్రతి టీవీలోనూ ఈ చిత్రం ప్రసారం అవుతుంది.
ఇక పాటల విషయానికొస్తే.. తెలుగు సినిమాల్లో లంబోదరుడిని కీర్తిస్తూ ఎన్నో పాటలు వచ్చాయి. ఎన్టీఆర్, కృష్ణ హీరోలుగా తెరకెక్కిన ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలో ‘దేవుడు చేసిన మనుషుల్లారా..’ అనే పాట వినాయక నిమజ్జనం నేపథ్యంలో సాగుతుంది. వెంకటేష్ నటించిన ‘కూలీ నెంబర్ 1’ సినిమాలోని ‘దండాలయ్యా ఉండ్రాలయ్యా..’ పాట ఇప్పటికీ ప్రతి వినాయక మండపంలో వినిపిస్తూ ఉంటుంది. అలాగే దేవుళ్లు చిత్రంలోని ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంపై 'జయజయ శుభకర వినాయక.. శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక’ అంటూ సిద్ధి వినాయకుడి వైభవం గురించి చెప్పే పాట ఓ ఆణిముత్యం.
చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘జై చిరంజీవ’ సినిమాలో ‘జై జై గణేశా.. జై కొడత గణేశా..’ పాట సూపర్‌హిట్‌గా నిలిచింది. బాలకృష్ణ ‘డిక్టేటర్’ మూవీలోని ‘గం గం గణేశా..’ అనే పాట కూడా ఆకట్టుకుంది. రామ్ ‘గణేష్’ మూవీలో వినాయకుడిపై ఒక పాట ఉంది. ‘దేవదాస్’ సినిమాలో నాగార్జున, నాని వినాయకుణ్ణి కీర్తిస్తూ పాడే పాట భలే పాపులర్ అయింది. పదకొండు రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో ఈ పాటలన్నీ మార్మొగుతుంటాయి. టాలీవుడ్లో గణపతిపై పాట వచ్చిన ప్రతి సినిమా, పాట హిట్టే.