Vijayawada Floods: మెగా డాటర్ నిహారిక సంచలన నిర్ణయం

ABN, Publish Date - Sep 07 , 2024 | 07:10 PM

ఇటీవల తెలుగు రాష్ట్రాలలో సంభవించిన విపత్తు గురించి అందరికీ తెలిసిందే. దాదాపు 5 రోజులు అవుతున్నా.. ఇంకా కొన్ని గ్రామాలు జలమయమై ఉండటం బాధపడాల్సిన విషయం. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలను ఆదుకునేందుకు టాలీవుడ్ సెలబ్రిటీలెందరో ముందుకు వచ్చారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోలంతా విరాళం ప్రకటించి గొప్ప మనసు చాటుకున్నారు. ఇప్పుడు వారి దారిలో నిహారిక కూడా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Mega Daughter Niharika

ఇటీవల తెలుగు రాష్ట్రాలలో సంభవించిన విపత్తు గురించి అందరికీ తెలిసిందే. దాదాపు 5 రోజులు అవుతున్నా.. ఇంకా కొన్ని గ్రామాలు జలమయమై ఉండటం బాధపడాల్సిన విషయం. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు సాధ్యమైనంతగా ఈ విపత్తు నుంచి ప్రజలను బయటపడేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాలకు అండగా ఉండేందుకు పులువురు ముందుకు రావడం ఆహ్వానించదిగిన పరిణామం. టాలీవుడ్‌కు సంబంధించి ఇప్పటికే ఎందరో విరాళాలు ప్రకటించి.. తమ గొప్ప మనసు చాటుకున్నారు. మెగా ఫ్యామిలీ (Mega Family)కి సంబంధించి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్‌లు ప్రకటించిన విరాళం దాదాపు రూ. 8.5 కోట్లు. ఇందులో పవన్ కళ్యాణ్ అధికంగా రూ. 6 కోట్లు ప్రకటించారు. ఇప్పుడు తన ఫ్యామిలీ ఇచ్చిన స్ఫూర్తితో మెగా డాటర్ నిహారిక (Mega Daughter Niharika) కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Also Read- Game Changer: అభిమానుల నిరీక్షణ ఫలించింది.. అదిరిపోయే పోస్టర్‌తో అప్డేట్


ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) 400 పంచాయితీలకు, పంచాయితీకి లక్ష చొప్పున రూ. 4 కోట్లు ప్రకటించినట్లుగా.. నిహారిక కూడా ఇప్పుడు విజయవాడ రూరల్ ఏరియాలో వరద ముంపుకు గురైన ఓ పది గ్రామాలకు ఒక్కో గ్రామానికి ఏభై వేలు చొప్పున ఐదు లక్షల రూపాయలను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు.


‘‘బుడమేరు వాగు ముంపుతో విజయవాడ రూరల్ ఏరియాలో అనేక గ్రామాలు నీట మునగడం, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుండడం నాకు చాలా బాధ కలిగించింది. ఇటువంటి ప్రకృతి విపత్తులో ఎక్కువగా ఇబ్బందులు పడేది గ్రామీణ ప్రాంత ప్రజలే. నేను పుట్టి పెరిగిన వాతావరణం అంతా నగరంలోనే అయినా మా పెద్దవారు అందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారే కాబట్టి.. వారు చెప్పే అనుభవాలు విన్న దృష్ట్యా నాకు గ్రామీణ వాతావరణంపై ఎంతో అభిమానం ఉంది.

ఉపముఖ్యమంత్రి అయినటువంటి మా బాబాయ్ పవన్ కళ్యాణ్‌గారితో పాటు మా కుటుంబీకులు అందరూ బాధితులకు అండగా నిలబడటం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. (Niharika Donation)

నేను కూడా ఈ బృహత్కార్యంలో పాలు పంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఉడతా భక్తిగా వరద ముంపుకు గురైన ఒక పది గ్రామాలకు ఒక్కో గ్రామానికి రూ. 50 వేలు చొప్పున ఐదు లక్షల రూపాయలను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను.

ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను..’’ అని నిహారిక పేర్కొన్నారు.

Read Latest Cinema News

Updated Date - Sep 07 , 2024 | 07:10 PM