మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Vijay Sethupathi: పవన్ అన్నీ ఎదుర్కొని గెలిచి..  తానేంటో నిరూపించారు!

ABN, Publish Date - Jun 10 , 2024 | 04:29 PM

ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్  అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్  కల్యాణ్‌ (Pawan kalyan) కూటమితో కలిసి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్  అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్  కల్యాణ్‌ (Pawan kalyan) కూటమితో కలిసి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో  పవన్  ఫాన్స్, పలువురు సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విజయం ఎప్పటికీ మరిచిపోలేమని కామెంట్స్‌ చేస్తున్నారు. తాజాగా కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి (Vijay sethupati) సైతం పవన్‌ కళ్యాణ్‌ గెలుపుపై వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ‘మహారాజా’ అనే సినిమాలో నటిస్తున్నారు విజయ్‌ సేతుపతి. నిథిలన్‌ స్వామినాథన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 14న తమిళంతోపాటు తెలుగులో కూడా విడుదలవుతుండడంతో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో పవన్‌ కళ్యాణ్‌ విజయంపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు.



‘‘పవర్‌ స్టార్‌కు నా బెస్ట్‌ విషెస్‌ తెలుపుతున్నా. ఆయన కష్టాన్ని నేను గౌరవిస్తాను. నాకు నిజంగా సంతోషంగా ఉంది. ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు ఆయనపై చాలా ట్రోల్స్‌ వచ్చాయని విన్నాను. ఆయన తొడకొట్టే వీడియో ఒకటి నేను చూశాను. పవన్‌ కళ్యాణ్‌ చాలా మాస్‌. ఆ స్థిరత్వం అనేది చాలా ముఖ్యం. వేరేవాళ్ల కథలో ఆయన హీరో కాదు. ఆయన కథలో ఆయనే హీరో. మనిషికి అలాంటి మానసిక బలం చాలా అవసరం. నాకు పవన్‌ కళ్యాణ్‌ గురించి ఏమీ తెలియదు. కానీ నా వాట్సాప్‌లో కొందరు తెలుగు వ్యక్తులు ఉన్నారు. వాళ్లంతా పవర్‌ స్టార్‌ వీడియోలు స్టేటస్‌లు పెడుతుంటారు. అలా అవన్నీ నేను చూస్తుంటాను. ఆ స్టేటస్‌లు చూసి అసలు ఏమైంది, ఏంటి అని వాళ్లను అడిగాను. నాకు అసలు ఏం జరిగిందో తెలియదు. వాళ్లు నాకు చాలా విషయాలు చెప్పారు. పవన్‌ కళ్యాణ్‌ కేవలం సినిమాల్లో మాత్రమే మాస్‌ కాదు, రియల్‌ లైఫ్‌లో కూడా మాస్‌ అని అప్పుడే తెలిసింది. ఎవరైతే ఇలాంటి ట్రోల్స్‌, మీమ్స్‌ ఎదుర్కొని మానసికంగా ధృడంగా ఉండడం మామూలు విషయం కాదు. ఎందుకంటే ప్రతీరోజూ మన గురించి చాలా విమర్శలు వస్తుంటాయి. నేను అవి చూడకపోవచ్చు, పట్టించుకోకపోవచ్చు కానీ నా చుట్టూ ఉన్నవాళ్లు వచ్చి అవన్నీ నాకు చూపిస్తూ ఉంటారు. చూడండి వాళ్లు మీ గురించి ఇలా అంటున్నారు అని పదేపదే చెప్తున్నప్పుడు కూడా మనం మానసికంగా ధృడంగా ఉండగలగాలి. అయితే పవన్‌ కళ్యాణ్‌ అన్నీ ఎదుర్కొని ఇప్పుడు ఆయనంటో అందరికీ చూపించారు’’ అని విజయ్‌ సేతుపతి పవన్  గురించి గొప్పగా మాట్లాడారు.

పవన్‌ లాగానే తనను కూడా రాజకీయాల్లో చూేస అవకాశం ఉందా అని అడగగా.. ఆ ప్రశ్నను కట్‌ చేయమని నవ్వుతూ చెప్పారు. తమిళ రాజకీయాల్లో విజయ్‌ పాల్గొంటున్నారు కదా అని ప్రశ్నిస్తుండగా ఆ ప్రశ్నను ఆపేమయని అన్నారు విజయ్‌ సేతుపతి.   

Read more!
Updated Date - Jun 10 , 2024 | 04:29 PM