Salaar: విడుదల గురించి నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, Publish Date - Jan 04 , 2024 | 11:34 AM
ప్రభాస్ (Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్ (Prashanth neel) తెరకెక్కించిన చిత్రం ‘సలార్’ (Salaar)చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఇప్పుడు అభిమానులు, సినీ ప్రియులు దీని సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రభాస్ (Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్ (Prashanth neel) తెరకెక్కించిన చిత్రం ‘సలార్’ (Salaar)చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఇప్పుడు అభిమానులు, సినీ ప్రియులు దీని సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సలార్ పార్ట్ 2’ (Salaar part-2) విడుదలపై నిర్మాత విజయ్ కిరగందూర్ (VIjay kiragandhur) స్పందించారు. నేషనల్ మీడియాతో మాట్లాడుతూ 2025లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు.
‘‘సలార్ 2 స్క్రిప్ట్ సిద్థంగా ఉంది. ఎప్పుడైనా చిత్రీకరణ ప్రారంభించే అవకాశాలున్నాయి. ప్రభాస్, ప్రశాంత్ నీల్ వీలైనంత త్వరగా షూటింగ్ మొదలు పెట్టానలుకుంటున్నారు. రెండో భాగానికి 15 నెలలు షెడ్యూల్ వేసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులందరినీ ‘సలార్’ ఆకట్టుకుంది. ప్రభాస్‌ని చాలాకాలం తర్వాత యాంగ్రిమ్యాన్గా చూశారు. సెకెండ్పార్ట్ ఇంతకుమించి ఉంటుంది. వసూళ్ల విషయంలో చాలా ఆనందంగా ఉంది. కొంత నెగెటివిటీ ఉన్నా మేకింగ్ విషయంలో ఎవరూ విమర్శించలేదు’’ అని విజయ్ పేర్కొన్నారు.
‘‘సలార్ 1’.. పార్ట్ 2కు టీజర్‌లాంటిది. సలార్-2 ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లా ఉండబోతోంది. యాక్షన్, డ్రామా, పాలిటిక్స్.. ఇలా పలు అంశాలు ఈ సీక్వెల్లో కనిపిస్తాయి. దర్శకుడు పార్ట్ 1లో పాత్రలి పరిచయం చేశారు. రెండోపార్ట్లు చాలా ట్విస్ట్‌లు, సర్ప్రైజ్లు ఉంటాయి’’ అని వెల్లడించారు.