Vijay Deverakonda: విజయ్‌తో ఆ హీరో, పూనకాలే.. ఎవరంటే
ABN, Publish Date - Nov 28 , 2024 | 11:52 AM
విజయ్ దేవరకొండ కంబ్యాక్‌పై అంచనాలు మరింత పెంచేలా 'VD 12' మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్‌లోని ఇద్దరు పవర్ ఫుల్ నటులు దేవరకొండకి సహాయం అందించనున్నారు. వాళ్ళు ఎవరు? ఏం సహాయం చేస్తున్నారంటే..
రౌడీ బాయ్ 'విజయ్ దేవరకొండ' హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న సినిమా 'VD 12'. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. 2025 సమ్మర్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే రిలీజైన ఓ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ లుక్ అందరిని తెగ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే మూవీ టీమ్ అప్డేట్స్‌తో హైప్ క్రియేట్ చేయాలనీ భావిస్తోంది. అయితే ఈ చిత్ర మేకర్స్ చేసిన ప్లాన్‌కి మీ మైండ్ బ్లైండ్ కావాల్సిందే. ఇంతకీ ఈ మూవీ మేకర్స్ ఏం ప్లాన్ చేస్తున్నారంటే..
తాజాగా 'జీబ్రా' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్. టాలెంట్ ఉన్నా.. సరైన గుర్తింపుకు నోచుకోని నటులలో సత్యదేవ్ ఒకరు. ఆయన సినిమాలలో మంచి కంటెంట్ ఉంటుంది. అలాగే నటన పరంగా 100 శాతం న్యాయం చేసే సత్యదేవ్.. ‘జీబ్రా’తో ఎట్టకేలకు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే మొదటి నుండి ఆయన మెయిన్ లీడ్ పాత్రల్లో నటిస్తున్నే, కీలక సపోర్టింగ్ రోల్స్‌లో అదరగొడుతున్నారు. చిరంజీవి 'గాడ్ ఫాదర్'లో విలన్‌గా చేసిన సత్యదేవ్, 'ఆర్ఆర్ఆర్'లోను ఓ రోల్ చేశారు. కానీ.. అది ఫైనల్ అవుట్ ఫుట్ లో బయటికి రాలేదు. ఈ నేపథ్యంలోనే 'VD 12'లో కీలక పాత్రల్లో నటించనున్నారని తెలుస్తోంది.
మరోవైపు ఈ సినిమా టైటిల్ ఇంకా రివీల్ కాకపోవడంతో మేకర్స్ టైటిల్ టీజర్‌ని విడుదల చేసేందుకు సిద్దమవుతున్నారు. అయితే ఈ టీజర్‌కి గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృషని వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు సంప్రదించారట మేకర్స్. దీనికి ఆయన కూడా సానుకూలంగా స్పందించారట. దీంతో రౌడీ బాయ్ ప్లస్ గాడ్ ఆఫ్ మాసెస్ కాంబినేషన్‌లో టీజర్ ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి అంటున్నారు ఫ్యాన్స్. 'మళ్ళీ రావా', 'జెర్సీ' వంటి సినిమాలతో ఫీల్ గుడ్ ఎమోషనల్ సినిమాలు అందించిన గౌతమ్ తిన్ననూరి ఈ సారి యాక్షన్ జోనర్ లోకి షిఫ్ట్ అయ్యాడు. ఇది ఈ సినిమా పోస్టర్ చూస్తేనే తెలిసిపోతుంది. ఇక విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. ఇక సత్యదేవ్ కూడా యాడ్ కావడంతో ఇది విజయ్‌కి మంచి కంబ్యాక్ ఫిల్మ్ కాబోతుందని విశ్లేషకుల మాట