Vijay Deverakonda: డియర్‌ రౌడీ ఫ్యాన్స్‌.. ఈ సారి మంచి ఎక్స్‌పీరియన్స్‌

ABN, Publish Date - Oct 18 , 2024 | 06:05 PM

విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కలయికలో వస్తున్న మొదటి సినిమా కావడంతో 'VD12' పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఫాన్స్‌కి మంచి మెసేజ్ ఇచ్చాడు. ఇంతకీ ఆ మెసేజ్ ఏంటంటే..

Vijay Devarakonda

అభిమానులు రౌడీ అని అభిమానంతో పిలుచుకొనే విజయ్ దేవరకొండ (Vijay devarakonda), తన అద్భుతమైన నటనా నైపుణ్యంతో స్టార్‌గా ఎదగడమే కాకుండా, దేశవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులకు చేరువయ్యారు. విజయ్ దేవరకొండ (Vijay devarakonda) సినిమా వస్తుందంటే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టి ఉంటుంది. అలాంటి విజయ్, 'మళ్ళీరావా', 'జెర్సీ' చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు, జాతీయ అవార్డు విజేత గౌతమ్ తిన్ననూరి (gowtham tinnanuri) తో చేతులు కలిపారు. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంతో అందరినీ థ్రిల్ చేయడానికి సిద్ధమవుతున్నారు.


'VD12' అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కలయికలో వస్తున్న మొదటి సినిమా కావడంతో 'VD12' పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని అద్భుతంగా మలుస్తున్నారు. థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడమే లక్ష్యంగా, ఎక్కడా రాజీ పడకుండా ఎంతో శ్రద్ధతో, అవిశ్రాంతంగా పని చేస్తోంది చిత్ర బృందం.


తాజాగా ఈ సినిమా కేరళలో 60% షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా విజయ్ ఫ్యాన్స్‌ని ఉద్దేశించి మాట్లాడాడు. " ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకం, నాకు ఎన్నో జ్ఞాపకాలు అందించింది అన్నారు. ఆలాగే కేరళలో మంచి యాక్షన్ సీక్వెన్సెస్ షూట్ చేశామన్నారు. డియర్ రౌడీస్ ఈ సినిమాతో మీకు మంచి థియాట్రికల్ ఎక్స్ పీరియన్స్ అందించటానికి చాలా కష్టం పడుతున్నామని" అన్నారు. అలాగే ఈ లుక్ ఒకటి లీక్ అయ్యిందని.. ఆ ఫోటోలను ఎవరు షేర్ చెయ్యొద్దన్నారు. ఈ సమ్మర్ మార్చి 28న విడుదల కానున్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ‘విధి పిలిచింది.. రక్తపాతం ఎదురుచూస్తోంది.. కొత్త రాజు ఉద్భవిస్తాడు’ అంటూ టైటిల్ పోస్టర్‌తోనే సినిమా ప్రేక్షకుల అటెన్షన్ కొట్టేసింది.

Updated Date - Oct 18 , 2024 | 06:09 PM