మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Vijay Devarakonda: అమెరికాలో విజయ్‌ సందడి!

ABN, Publish Date - Jun 10 , 2024 | 03:33 PM

షూటింగ్‌లతో బిజీగా ఉన్న విజయ్‌ దేవరకొండ అమెరికా ట్రిప్‌ వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలో చక్కర్లు కొడుతున్నారు. అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆయన అతిథిగా హాజరయ్యారు.


షూటింగ్‌లతో బిజీగా ఉన్న విజయ్‌ దేవరకొండ (Vijay Devarajonda) అమెరికా ట్రిప్‌ వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలో చక్కర్లు కొడుతున్నారు. అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ATA) నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆయన అతిథిగా హాజరయ్యారు. అక్కడి తెలుగు అసోసియేషన్  సభ్యులు విజయ్‌కు ఘన స్వాగతం పలికారు. అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘అమెరికాలో విజయ్‌ క్రేజ్‌’ అంటూ నెటిజన్లు వాటిని షేర్‌ చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఇటీవలే ‘ఫ్యామిలీ స్ట్టార్‌’తో (Familystar) పలకరించిన ఆయన త్వరలోనే మూడు సినిమాలతో అలరించేందుకు సిద్థమయ్యారు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఓ చిత్రం తెరకెక్కుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రానున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. ఇందులో విజయ్‌ గూఢచారి పాత్రలో కనిపించనున్నారు. అలాగే రవికిరణ్‌ కోలా డైరెక్షన్‌లో పాన్  ఇండియా సినిమా చేస్తున్నారు. వీటితో పాటు రాహుల్‌ సంకృత్యాన్‌తో ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. 1854 నుంచి 1873 మధ్య సాగిన కథగా ఇది రానుంది.

Read more!
Updated Date - Jun 10 , 2024 | 09:58 PM