Chiru- Venky: విశ్వంభరుడి సెట్స్‌లో వెంకీ మూవీ టీమ్.. ఫొటోస్ వైరల్

ABN, Publish Date - Oct 11 , 2024 | 09:42 PM

అగ్ర హీరోల చిత్రాల షూటింగ్స్‌ ఒకేచోట జరుగుతున్నప్పుడు ఒక హీరో సెట్‌కు మరో హీరో వెళ్లడం, సరదాగా కాసేపు గడపడం, సినిమాల గురించి మాట్లాడుకోవడం గతంలో ఓ అలవాటుగా, సంప్రదాయంగా ఉండేది. హీరోల మధ్య ఐకమత్యానికీ, స్నేహబంధానికీ అటువంటి సంఘటనలు అద్దం పట్టేవి. ఈ మధ్య కాలంలో మరుగున పడిన ఈ సంప్రదాయాన్ని మరోసారి చిరు, వెంకీ, బాలయ్యలు పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు.

Chiranjeevi, Aishwarya Rajesh and Meenakshi

అగ్ర హీరోల చిత్రాల షూటింగ్స్‌ ఒకేచోట జరుగుతున్నప్పుడు ఒక హీరో సెట్‌కు మరో హీరో వెళ్లడం, సరదాగా కాసేపు గడపడం, సినిమాల గురించి మాట్లాడుకోవడం గతంలో ఓ అలవాటుగా, సంప్రదాయంగా ఉండేది. హీరోల మధ్య ఐకమత్యానికీ, స్నేహబంధానికీ అటువంటి సంఘటనలు అద్దం పట్టేవి. చాలా రోజుల తర్వాత ఈ మధ్య నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మళ్లీ ఆ సంప్రదాయాన్ని గుర్తుకు తెచ్చారు. ఇప్పుడా సంప్రదాయాన్ని విక్టరీ వెంకటేష్ ఇంకాస్త ముందుకు తీసుకెళ్లారు. విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) టున్నారు.. బాలయ్య, సంప్రదాయం అని ఏదేదో అంటున్నారు కానీ విషయం చెప్పడం లేదేంటి అనుకుంటున్నారా? అయితే విషయంలోకి వస్తే..

రీసెంట్‌గా వెంకటేశ్‌ హీరోగా అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో దిల్‌ రాజు (Dil Raju) నిర్మిస్తున్న తాజా చిత్రం షూటింగ్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతోండగా.. ఆ సమయంలో అక్కడే ఉన్న బాలకృష్ణ ఈ విషయం తెలుసుకుని వెంకటేశ్‌ (Venkatesh) షూటింగ్‌ స్పాట్‌కు వెళ్లి సందడి చేశారు. బాలయ్య, వెంకీ మంచి స్నేహితులు. అలాగే అనిల్‌ రావిపూడి బాలయ్యతో ‘భగవంత్‌ కేసరి’ చిత్రం రూపొందించారు. బాలయ్య రాకతో టీమ్‌ చాలా థ్రిల్‌ అయింది. ఇప్పుడు వెంకీ అండ్ టీమ్‌ మెగాస్టార్ చిరంజీవి‌ని సర్‌ప్రైజ్ చేశారు.


వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న సెట్స్‌ దగ్గరే ‘విశ్వంభర’ సినిమా షూట్ కూడా జరుగుతుండటంతో.. వెంకీ మూవీ టీమ్ అంతా వెళ్లి విశ్వంభర (Vishwambhara) చిరంజీవి అండ్ టీమ్‌ని సర్‌ప్రైజ్ చేశారు. వాస్తవానికి అనిల్ రావిపూడి చేస్తున్న ప్రాజెక్ట్ ముందు చిరంజీవి వద్దకే వెళ్లిందనేలా అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. కానీ, ఆ సబ్జెక్ట్ తనకు సెట్ కాదని చిరు చెప్పడంతో.. అదే సబ్జెక్ట్‌తో వెంకీతో అనిల్ రావిపూడి సెట్స్‌పైకి వెళ్లారు. సరే ఆ విషయం పక్కన పెడితే.. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అండ్ టీమ్.. వెంకీ మూవీ టీమ్‌ని చూడగానే చాలా హ్యాపీగా ఫీలయ్యారు. వెంకీ మూవీ టీమంతా చిరుతో ఫొటోలు కూడా దిగారు. ఆ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Also Read- Viswam Review: గోపీచంద్‌, శ్రీను వైట్ల కాంబో ఫిల్మ్ ‘విశ్వం’ ఎలా ఉందంటే...

Also Read- Maa Nanna Superhero Review: సుధీర్‌బాబు నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉందంటే..

Also Read- Vettaiyan Review: రజనీకాంత్ నటించిన యాక్షన్ మూవీ ‘వేట్ట‌య‌న్... ది హంట‌ర్‌’ ఎలా ఉందంటే.. 

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 11 , 2024 | 10:03 PM