Venky Atluri: మేము ముగ్గురం దుల్కర్‌తో సినిమాలు చేసి హిట్లు కొట్టాం

ABN, Publish Date - Nov 03 , 2024 | 06:54 PM

రూపాయి గురించి ఆలోచించకుండా పేరు గురించి మాత్రమే ఆలోచించి ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు పెట్టారు నాగవంశీ.. పేరుతో పాటు, ఇప్పుడు సినిమాకి డబ్బులు కూడా రావడం సంతోషంగా ఉందని అన్నారు ‘లక్కీ భాస్కర్’ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి. దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన హ్యాట్రిక్ చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఈ చిత్ర సక్సెస్ మీట్‌లో వెంకీ తన సంతోషాన్ని తెలియజేశారు.

Director Venky Atluri

రూపాయి గురించి ఆలోచించకుండా పేరు గురించి మాత్రమే ఆలోచించి ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు పెట్టారు నాగవంశీ.. పేరుతో పాటు, ఇప్పుడు సినిమాకి డబ్బులు కూడా రావడం సంతోషంగా ఉందని అన్నారు ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి. దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన హ్యాట్రిక్ చిత్రం ‘లక్కీ భాస్కర్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. వెంకీ అట్లూరి దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఆదివారం సక్సెస్ మీట్‌ను ఘనంగా నిర్వహించింది.

Also Read-Narne Nithin: ఎన్టీఆర్‌ బావమరిది నిశ్చితార్థం

ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. నాగ్ అశ్విన్, హను గారిని ఈ వేదికపై చూడటం సంతోషంగా ఉంది. నేను నటుడిగా ఉన్నప్పుడు చంద్రశేఖర్ యేలేటి గారి సినిమా కోసం హను గారు నన్ను ఆడిషన్ చేశారు. అలాగే ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అప్పుడు నాగి నన్ను ఆడిషన్ చేశాడు. ఇప్పుడు మేము ముగ్గురం దుల్కర్ గారితో సినిమాలు చేసి హిట్లు కొట్టాం. ‘లక్కీ భాస్కర్’తో పాటు దీపావళికి విడుదలైన సినిమాలన్నీ విజయవంతంగా ప్రదర్శితమవుతున్నాయి. ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ మనతో లైఫ్ లాంగ్ ఉంటుంది. అందుకే ఒకేసారి మూడు మంచి సినిమాలు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ‘ఏబీసీడీ’ సినిమా చూసినప్పటి నుంచి దుల్కర్ గారితో పని చేయాలనుకున్నాను. ఇప్పుడు ‘లక్కీ భాస్కర్’తో కుదిరింది. కథ విన్న వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా సినిమా చేయడానికి అంగీకరించారు. ‘గుంటూరు’ కారం చేస్తున్నప్పుడు మీనాక్షి పేరుని త్రివిక్రమ్ గారు, వంశీగారు సూచించారు. ఆడిషన్ చేసినప్పటి నుంచి తను నా కంటికి సుమతి లాగానే కనిపించింది. అలాగే సాయి కుమార్ గారు, శ్రీనాథ్ మాగంటి, కసిరెడ్డి, మహేష్, శశిధర్ గారు, శివన్నారాయణ గారు, గాయత్రీ భార్గవి గారు, మాణిక్ గారు, సచిన్ ఖేడేకర్, రఘుబాబు గారు, శ్రీకాంత్, మానస్ అందరూ తమ పాత్రలకు న్యాయం చేసి సినిమాని నిలబెట్టారు. హైపర్ ఆదికి స్పెషల్ థాంక్స్.


అందరూ సినిమాలో సెట్స్ సహజంగా ఉన్నాయని మాట్లాడుకుంటున్నారంటే దానికి కారణం నా ప్రొడక్షన్ డిజైనర్ బంగ్లాన్. సినిమాటోగ్రాఫర్ నిమిష్ మరియు బంగ్లాన్‌ని నాకు పరిచయం చేసినందుకు దుల్కర్ గారికి థాంక్స్. వీరితో పాటు సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్, ఎడిటర్ నవీన్ ఇలా అందరూ కలిసి పని చేయడం వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. రూపాయి గురించి ఆలోచించకుండా పేరు గురించి మాత్రమే ఆలోచించి ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు పెట్టారు నాగవంశీ గారు. పేరుతో పాటు, సినిమాకి డబ్బులు కూడా రావడం సంతోషంగా ఉంది. ఆ కాలంలో దుస్తులు ఎలా ఉంటాయో రీసెర్చ్ చేసి, అందుకు తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన అర్చన, సంధ్యకి థాంక్స్. కొరియోగ్రాఫర్ రఘు గారికి, గీత రచయితలు రామజోగయ్య శాస్త్రి గారికి, శ్రీమణి గారికి థాంక్స్. అలాగే మా దర్శకత్వ విభాగంతో పాటు, ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు. మాకు సపోర్ట్‌గా నిలిచిన మీడియాకి, మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలని చెప్పుకొచ్చారు.

Also Read-యంగ్ చాప్ ఎన్టీఆర్‌కు నారా భువనేశ్వరి ఆశీస్సులపై వైవిఎస్ చౌదరి స్పందనిదే..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 03 , 2024 | 06:54 PM