Venkatesh: వెంకటేశ్ రెండో కుమార్తె పెళ్లి.. ముహూర్తం ఎప్పుడంటే!
ABN, Publish Date - Mar 15 , 2024 | 06:04 PM
వెంకటేశ్ ఇంట పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. ఆయన రెండో కుమార్తె హవ్య వాహిని వివాహం విజయవాడకు చెందిన డా.పాతూరి వెంకటరామారావు, డా. అరుణ దంపతుల కుమారుడు డా. నిషాంత్ తో శుక్రవారం రాత్రి 9.36 నిమిషాలకు జరగనుంది.
విక్టరీ వెంకటేశ్ ఇంట పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. ఆయన రెండో కుమార్తె హవ్య వాహిని వివాహం విజయవాడకు చెందిన డా.పాతూరి వెంకటరామారావు, డా. అరుణ దంపతుల కుమారుడు డా. నిషాంత్ తో శుక్రవారం(మార్చి 15) రాత్రి 9.36 నిమిషాలకు జరగనుంది. నార్సింగిలోని 'ది అడ్రస్ కన్వెన్షన్ సెంటర్ ఈ వివాహ వేడుకకు వేదిక కానుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు సినీ, రాజకీయ నాయకులు ఈ హవ్య వాహిని, నిశాంత్ ల వివాహానికి హాజరుకానున్నట్లు సమాచారం.
గురువారం మెహందీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలను నమ్రతా శిరోద్కర్ షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆమె పోస్ట్ చూసిన నెటిజన్లు వెంకీ కుటుంబానికి శుభాకాంక్షలు చెబుతున్నారు. గతేడాది అక్టోబర్లో హవ్య వాహిని నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుకకు చిరంజీవి, మహేశ్ బాబు, రానా, నాగచైతన్య హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.