Vashishta: సుమన్ తేజ్ ‘వశిష్ట’ మూవీ గ్రాండ్‌గా ప్రారంభం

ABN, Publish Date - Nov 24 , 2024 | 09:12 PM

సుమన్ తేజ్, అను శ్రీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘వశిష్ఠ’. ఈ చిత్రాన్ని బేబి నేహా సమర్పణలో లిటిల్ బేబీస్ క్రియేషన్స్ బ్యానర్ పై నోరి నాగప్రసాద్ నిర్మిస్తున్నారు. మైథలాజికల్ సోషల్ డ్రామా కథతో దర్శకుడు హరీశ్ చావా రూపొందిస్తున్న ఈ మూవీ ప్రారంభ విశేషాలిలా ఉన్నాయి.

Vashishta Movie Opening

సుమన్ తేజ్, అను శ్రీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘వశిష్ఠ’. ఈ చిత్రాన్ని బేబి నేహా సమర్పణలో లిటిల్ బేబీస్ క్రియేషన్స్ బ్యానర్ పై నోరి నాగప్రసాద్ నిర్మిస్తున్నారు. మైథలాజికల్ సోషల్ డ్రామా కథతో దర్శకుడు హరీశ్ చావా రూపొందిస్తున్న ఈ మూవీ ఆదివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. తెలుగు టెలివిజన్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ నాగబాల సురేష్ కుమార్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, నిర్మాత లయన్ సాయి వెంకట్ స్క్రిప్ట్ అందజేశారు. నటుడు గగన్ విహారి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. యాడ్ ఫిలింమేకర్ యమున కిషోర్ ఫస్ట్ షార్ట్ డైరెక్షన్ చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత నోరి నాగప్రసాద్ మాట్లాడుతూ.. మా ‘వశిష్ఠ’ చిత్రం లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కావడం సంతోషంగా ఉంది. హాజరైన అతిథులందరికీ ధన్యవాదాలు. పక్కా స్క్రిప్ట్ వర్క్‌తో ‘వశిష్ఠ’ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని అందించే సినిమా అవుతుంది. స్క్రిప్ట్ వినగానే మా హీరో సుమన్ తేజ్ చాలా హ్యాపీగా ఫీలయ్యారు. టీమ్ అంతా ఉత్సాహంగా వర్క్ చేస్తున్నాం. ఒక సక్సెస్ ఫుల్ మూవీతో మీ ముందుకు వస్తాం. మీడియా సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.


డైరెక్టర్ హరీశ్ చావా మాట్లాడుతూ.. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే సోషల్ డ్రామా ఇది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ. కథ వినగానే సింగిల్ సిట్టింగ్‌లో మా హీరో సుమన్ తేజ్ ఓకే చేశారు. మంచి టీమ్ నాకు సపోర్ట్‌గా దొరికింది. మ్యూజిక్ మీర్ వలీ, డీవోపీ కార్తీక్ ఎంతో సపోర్టివ్‌గా ఉన్నారు. టీమ్‌లో ఏ టెక్నీషియన్ కూడా ఇబ్బంది పెట్టకుండా కోపరేట్ చేస్తున్నారు. అలాగే మా ప్రొడ్యూసర్ నాగ ప్రసాద్ నాకు వెన్నంటే ఉన్నారు. ఒక మంచి మూవీతో మీ ముందుకు వస్తాం. మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.

హీరో సుమన్ తేజ్ మాట్లాడుతూ.. నేను ఇప్పటికే మూడు చిత్రాల్లో నటించాను. రంగస్థలం లాంటి బ్యాక్ డ్రాప్ మూవీలో నటించాలనే కోరిక ఉండేది. వశిష్ఠ మూవీ కథ విన్నప్పుడు నేను కోరుకున్న స్క్రిప్ట్ అనే ఫీల్ కలిగింది. వశిష్ఠ టైటిల్ లోనే ఒక పాజిటివ్‌నెస్ ఉందనిపించింది. మా ప్రొడ్యూసర్ ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. డైరెక్టర్ హరీశ్ ప్రతిభ ఈ సినిమాతో అందరికీ తెలుస్తుంది. టైమ్ తీసుకోకుండా వెంటనే ఓకే చెప్పాను. అలాగే ఫ్రెండ్లీ అండ్ టాలెంటెడ్ టీమ్ దొరికారు. మేమంతా ఒక మంచి మూవీతో మీ ముందుకు రాబోతున్నాం. మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాం. వశిష్ఠ మూవీ సక్సెస్ మీట్ లో కలుద్దాం అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సినిమాకు సంబంధించిన పలువురు మాట్లాడారు.

Updated Date - Nov 24 , 2024 | 09:12 PM