మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Paruvu: ‘పరువు’ ట్రైలర్‌ను వ‌దిలిన మెగా ప్రిన్స్.. వారికి ZEE 5 బంప‌రాఫ‌ర్

ABN, Publish Date - Jun 02 , 2024 | 07:34 PM

నాగబాబు, నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య, బిందు మాధవి, ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందిన వెబ్ సిరీస్ ప‌రువు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి బ్యాన‌ర్‌పై సుస్మిత నిర్మించారు. తాజాగా ఈ సిరీస్ ట్రైల‌ర్‌ను మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ రిలీజ్ చేశారు.

paruvu

గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి (Gold Box Entertainments). బ్యానర్ మీద విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి, సుస్మిత కొణిదెల (Sushmita Konidela) నిర్మించిన ZEE5 ఒరిజినల్ సిరీస్ ‘పరువు’(Paruvu). సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకులు. ఈ మూవీలో నాగబాబు (Naga Babu Konidela), నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj), నరేష్ అగస్త్య (Naresh Agastya), ప్రణీత పట్నాయక్ (Praneeta Patnaik), బిందు మాధవి, అమిత్ తివారి వంటి వారు ప్రముఖ పాత్రలు పోషించారు. పవన్ సాధినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఇక ఈ ట్రైలర్‌ను చూస్తే.. పరువు అనే టైటిల్ ఎందుకు పెట్టారో క్లియర్‌గా అర్థం అవుతోంది. ఓ ప్రేమ జంట, కులాలు అడ్డు రావడం, పారిపోయి పెళ్లి చేసుకోవడం, పరువు కోసం పేరెంట్స్ చేసిన డ్రామా.. ఆ జంటకు ఎదురైన కష్టాలు ఇలా అన్నింటిని ఎంతో ఉత్కంఠభరితంగా ఈ ట్రైలర్‌లో చూపించారు. కారు డిక్కీలో ఉన్న శవం ఎవరిది? మర్డర్ కేస్ నుంచి ఎలా బయట పడ్డారు? పరువు హత్యకు గురవుతామని భయపడ్డ వాళ్లే.. ఓ హత్యను చేయడంతో ఎదురైన కష్టాలు ఏంటి? వాటి నుంచి ఎలా బయటపడ్డారు? ఇలా అనేక ఆసక్తికరమైన ప్రశ్నలు లేవనెత్తేలా ట్రైలర్ ఉంది.


బిందు మాధవి ట్రైలర్ చివర్లో ఎంట్రీ ఇవ్వడం, నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) బిందు మాధవి మధ్య వచ్చే సీన్ అదిరిపోయింది. ఇక నాగబాబు (Naga Babu Konidela) చాలా రోజులకు ఓ సీరియస్ పాత్రను పోషించినట్టుగా కనిపిస్తోంది. శ్రావణ్ భరద్వాజ్ ఆర్ఆర్ ట్రైలర్‌లో అదిరిపోయింది. చింతా విద్యా సాగర్ సినిమాటోగ్రఫీ ఎంతో నేచురల్‌గా ఉంది. ఈ సిరీస్‌ ZEE5 ఒరిజినల్ సిరీస్ జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. మొదటి ఎపిసోడ్‌ను అందరూ ఉచితంగానే వీక్షించవచ్చు. ఇక ఈ క్రమంలో ‘పరువు’ ట్రైలర్‌ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) రిలీజ్ చేశారు.

Updated Date - Jun 02 , 2024 | 07:34 PM