Matka: ముంబైలో అ సినిమా ప్రమోషన్స్.. తెలుగులో మాత్రం నిల్
ABN, Publish Date - Nov 13 , 2024 | 08:01 PM
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'మట్కా' నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ దేశవ్యాప్తంగా బాగానే జరుగుతున్న తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సరైన రెస్పాన్స్ కరువైంది. ఇంతకీ ఏమైందంటే..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'మట్కా'. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్ మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా (Matka) ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'మట్కా' నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ దేశవ్యాప్తంగా బాగానే జరుగుతున్న తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సరైన రెస్పాన్స్ కరువైంది. ఇంతకీ ఏమైందంటే..
పాన్ ఇండియా రిలీజ్ నేపథ్యంలో 'మట్కా' హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం ముంబైలో ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. మరోవైపు తెలుగులోనూ ఈ సినిమాకి తెలుగులోనూ భారీగా థియేటర్లు కేటాయించారు. కానీ.. ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా సరైన రెస్పాన్స్ కనిపించటం లేదు. వరుణ్ గత చిత్రాల ఎఫెక్ట్ ఈ సినిమాపై కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో కూడా కేవలం 10% బుకింగ్స్ మాత్రమే జరిగాయి. ఆన్‌లైన్‌లో స్క్రీన్స్ అన్ని ఖాళీగా కనిపిస్తున్నాయి. కాగా వరుణ్ ఈ సినిమాలో నాలుగు షేడ్స్‌లో కనిపిస్తున్నాడు. మౌత్ టాక్ బాగుంటే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.
'మట్కా' పీరియాడిక్ డ్రామాగా సిద్థమైంది. వరుణ్ నాలుగు భిన్నమైన గెటప్పుల్లో కనువిందు చేయనున్నారు. రతన్ ఖత్రి అనే గ్యాంబ్లర్ స్టోరీని ఆధారంగా చేసుకొని ఫిక్షనల్ కథ సిద్థం చేశామని దర్శకుడు చెప్పారు. ‘‘వాసు అనే వ్యక్తి ప్రయాణమే ఈ కథ. 1958లో చిన్నతనంలోనే శరణార్థిగా బర్మా నుంచి వైజాగ్‌కు వస్తాడు. అక్కడి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ ‘మట్కా’ కింగ్‌లా ఎలా మారాడనేది కథ’’.