Varun Tej: గ్యాంబ్లర్‌గా 'మెగా ప్రిన్స్' ఎప్పుడొస్తున్నాడంటే..

ABN, Publish Date - Oct 01 , 2024 | 01:02 PM

గతేడాది వచ్చిన గాండీవదారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్‌లతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకోలేకపోయాడు. వరుస ప్లాప్‌లతో ఢీలా పడ్డ ఈ మెగా హీరో ఎలాగైనా గట్టి హిట్ కొట్టాలని కసి మీదున్నాడు. దీంతో డైరెక్టర్ కరుణ కుమార్‌తో పాటు వరుణ్ తేజ్ కూడా ఈ సారి పకడ్బందీగా తమ స్టోరీ‌ని ప్లాన్ చేసుకున్నారు.

వరుస ప్లాప్స్‌తో సతమతవుతున్న 'మెగా ప్రిన్స్' వరుణ్ తేజ్(Mega Prince Varun Tej) ఈ సారి సరికొత్త అవతారమెత్తి అదృష్టం పరీక్షించుకోనున్నాడు. 'పలాస 1978'( Palasa 1978) చిత్రం ద్వారా డైరెక్టర్‌గా పరిచయమైన కరుణ కుమార్(Karuna Kumar) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్‌లో గ్యాంబ్లింగ్, జూదం మెయిన్ థీమ్‌గా 'మట్కా'(Matka) చిత్రం రూపుదిద్దుకోంటుంది. ఇప్పటికే రిలీజైన వరుణ్ తేజ్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. 'వాసు' క్యారెక్టర్‌లో మెగా ప్రిన్స్ థియేటర్ల ముందుకి ఎప్పుడు రానున్నాడో అనే సస్పెన్స్‌కి మూవీ యూనిట్ ఈరోజు బ్రేక్ వేసింది.


గతేడాది వచ్చిన గాందీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్‌లతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకోలేకపోయాడు. వరుస ప్లాప్‌లతో ఢీలా పడ్డ ఈ మెగా హీరో ఎలాగైనా గట్టి హిట్ కొట్టాలని కసి మీదున్నాడు. ఈ నేపథ్యంలోనే దర్శకుడు కరుణ కుమార్‌తో కలిసి స్ట్రాంగ్ స్క్రిప్ట్‌తో రానున్నాడు. ఈ సినిమాలో వరుణ్ సరసన మీనాక్షి చౌదరి నటిస్తుండగా బాలీవుడ్ హాట్ క్వీన్ నోరా ఫతే, మర్యాదరామన్న గర్ల్ సలోనితో పాటు నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపించనుండటం అందరిలో ఆసక్తిని పెంచుతోంది. తెలుగు వారికి తెలీకుండానే ప్లే‌లిస్ట్‌లోకి వచ్చేసిన తమిళ మ్యూజిక్ డైరెక్టర్ GV ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) ఈ సినిమాకి సంగీతం అందించటం విశేషం. వైరా ఎంటర్టైన్మెంట్స్(Vyra Entertainments) నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మొదటి చిత్రం పలాస 1978తోనే అవార్డులు కొల్లగొట్టిన కరుణ కుమార్ తరువాతి చిత్రాలతో మాత్రం నిరాశపరిచాడు. సుధీర్ బాబుతో చేసిన శ్రీదేవి సోడా సెంటర్‌తో తనలోని కమర్షియల్ యాంగిల్ చూపించిన కరుణ కుమార్ స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత తీసిన మెట్రో కథలు, కళాపురం కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో డైరెక్టర్ కరుణ కుమార్‌తో పాటు వరుణ్ తేజ్ కూడా ఈ సారి పకడ్బందీగా తమ స్టోరీ‌ని ప్లాన్ చేసుకున్నారు.

Updated Date - Oct 01 , 2024 | 01:40 PM