Matka: వరుణ్ తేజ్.. 'మట్కా' కీలక షెడ్యూల్‌ పూర్తి

ABN, Publish Date - Jul 19 , 2024 | 05:49 AM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ న‌టిస్తున్న చిత్రం మట్కా. ప‌లాస ఫేమ్‌ కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వ‌హించారు. తాజాగా చిత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో కీలకమైన, లెన్తీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.

Matka

అప‌రేష‌న్ దవాలంటైన్ చిత్రం త‌ర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) న‌టిస్తున్న చిత్రం మట్కా (Matka). ప‌లాస వంటి క‌ల్ట్ చిత్రాన్ని రూపొందించిన కరుణ కుమార్ (KarunaKumar) ఈ సినిమాకు దర్శకత్వం వ‌హించ‌గా వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ (Vyra Entertainments), ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. జీవీ ప్ర‌కాశ్ (G.V.Prakash Kumar) సంగీతం అందిస్తున్నాడు.

తాజాగా ఈ మట్కా (Matka) చిత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో (RFC)లో కీలకమైన, లెన్తీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. వింటేజ్ వైజాగ్‌ను ప్రతిబింబించేలా రూపొందించిన సెట్ల‌లో సినిమాలో చాలా కీలకమైన సన్నివేశాలు, హై-ఆక్టేన్ యాక్షన్ సీన్స్, రెట్రో థీమ్ సాంగ్స్‌ను చిత్రీక‌రించారు. కలర్‌ఫుల్ పబ్ సెట్‌లో బాలీవుడ్ న‌టి నోరా ఫతేహీ తో జానీ మాస్ట‌ర్ సార‌థ్యంలో ఓ పాట‌ను తెర‌కెక్కించారు.


అమెపై తీసిన పాట‌తో ఈ షెడ్యూల్ పూర్త‌వ‌గా మ‌రో కొత్త షెడ్యూల్ వైజాగ్‌లో శరవేగంగా జరుగుతోందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మేర‌కు మేకర్స్ నోరా ఫతేహీ (Norah Fatehi) షూటింగ్‌లో ఉన్న‌ ఫొటోతో తాజాగా పోస్టర్ విడుదల చేశారు. 1958 నుంచి 1982 వరకు 24 సంవత్సరాల పాటు సాగే కథలో వరుణ్ తేజ్ (Varun Tej) డిఫరెంట్ మేకోవర్‌లలో, చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ ని పోషిస్తున్నారు.

Updated Date - Jul 19 , 2024 | 04:56 PM