Varun Tej: నా ఇష్టం.. బాబాయ్, పెదనాన్న గురించి బరాబర్ మాట్లాడతా
ABN, Publish Date - Nov 11 , 2024 | 10:31 AM
మట్కా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం వైజాగ్లో జరిగింది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'మట్కా'. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్టైన్ మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా (Matka) ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'మట్కా' నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా వైజాగ్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు.
మట్కా ఈవెంట్లో వరుణ్ తేజ్ (Varun Tej) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి సినిమా రిలీజ్ ముందు ఒక టెన్షన్ ఉంటుంది. అలా టెన్షన్ పడుతున్నప్పుడు రామ్ చరణ్ అన్నయ్య నుంచి మొన్న మార్నింగ్ ఫోన్ వచ్చింది. అన్నయ్య ఎప్పుడు ఒక ఎమోషనల్ సపోర్ట్ గా ఉంటాడని బాబాయ్, పెదనాన్న ఎప్పుడు గుండెల్లో ఉంటారన్నారు. అందరూ వాళ్ళ గురించే ఎందుకు మాట్లాడతావని అడుగుతారు. మా బాబాయ్, మా పెదనాన్న, మా అన్నయ్య చరణ్ గురించి నేను మాట్లాడుతాను. అది నా ఇష్టం. లైఫ్లో నువ్వు పెద్దోడివి అవ్వొచ్చు అవ్వకపోవచ్చు. కానీ నువ్వు ఎందుకు, ఎక్కడ మొదలుపెట్టావు.. నీ వెనక సపోర్ట్ ఎవరు ఇచ్చారని నువ్వు మర్చిపోతే నీ సక్సెస్ ఎందుకు పనికిరాదు. చిరంజీవి గారు, బాబాయ్ కళ్యాణ్ గారు, నాన్న, అన్నయ్య.. వాళ్ళు నా మసన్సులో ఉంటారు. వాళ్ళు నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారన్నాడు.
కాగా.. తాజాగా వరుణ్ తేజ్ చేసిన చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ (Allu Arjun) బన్నీని ఉద్దేశించి చేసినవి అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. ఇదిలాఉండగా గతంలో నాగబాబు కూడా ఇదే తరహాలో బన్నీపై ట్వీట్ వేసి డిలీట్ చేసిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు వరుణ్ తేజ్ (Varun Tej) వ్యాఖ్యలు బన్నీకి కౌంటరా అనే చర్చ మొదలైంది. చూడాలి మరి ఇది ఎక్కడి వరకు వెళుతుందో.