VIRAAJI: కొత్త అవ‌తారంలో వ‌రుణ్ సందేశ్‌.. ఈసారి హిట్ కొట్టేలా ఉన్నాడే

ABN, Publish Date - Jul 11 , 2024 | 03:39 PM

వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో రూపొందిన చిత్రం "విరాజి". ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్‌ను బేబీ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ గురువారం విడుదల చేశారు.

VIRAAJI

మహా మూవీస్ (Maha Movies) మరియు ఎమ్ 3 మీడియా (M3 Media) బ్యానర్‌పై వరుణ్ సందేశ్ (Varun Sandesh) ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష (Adhyanth Harsha) దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల (Mahendra Nath Kondla) నిర్మించిన చిత్రం "విరాజి". ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్‌ను బేబీ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ (Director Sai Rajesh) గురువారం విడుదల చేశారు.

ఈ సందర్భంగా సాయి రాజేష్ (Director Sai Rajesh) మాట్లాడుతూ "ఇప్పుడే విరాజి టీజర్ చూసాను, చాలా బాగుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. వరుణ్ సందేశ్ లుక్ అదిరిపోయింది. క్యారెక్టర్ కోసం అంత అంకిత భావంతో పని చేస్తున్న వరుణ్ సందేశ్ కి కంగ్రాట్స్. ప్రమోషన్ లో కూడా తన క్యారెక్టర్ గెట్ అప్ లో పర్మనెంట్ హెయిర్ కలర్ లో ఉండటం చాలా అరుదు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ చిత్రాన్ని విడుదల చేయడం చాలా సంతోషం. నిర్మాత మహేంద్ర చిత్రం మంచి విజయం సాధించాలి" అని తెలిపారు.


వరుణ్ సందేశ్ (Varun Sandesh) మాట్లాడుతూ.. ఈరోజు మా విరాజి చిత్రం ఫస్ట్ లుక్ మరియు టీజర్ ను బేబీ దర్శకుడు సాయి రాజేష్ విడుదల చేయడం చాలా సంతోషం. ఈ చిత్రం నాకు చాలా స్పెషల్ సినిమా చాలా బాగా వచ్చిందన్నారు. దర్శకుడు ఆద్యంత్ హర్ష మాట్లాడుతూ "విరాజి నా మొదటి సినిమా. ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ను సాయి రాజేష్ గారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది.

వరుణ్ సందేశ్ లుక్ కి కథ కి చాలా దగ్గరి సంబంధం ఉందన్నారు. నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ "విరాజి అనే మంచి చిత్రాన్ని నిర్మించాము, ఈరోజు ఫస్ట్ లుక్ టీజర్ ని సాయి రాజేష్ విడుదల చేయడం ఆనందంగా ఉందని, ఆగస్టు 2న విడుదల అవుతుంది, అందరికి నచ్చుతుంది" అని తెలిపారు.

Updated Date - Jul 11 , 2024 | 03:42 PM