Varalaxmi Sarathkumar: పెళ్లి హడావిడి మొదలైంది.. ఫొటోలు వైరల్‌!

ABN, Publish Date - Jun 30 , 2024 | 07:35 PM

కోలీవుడ్‌ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ పెళ్లి సందడి మొదలైంది. ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో  షేర్‌ చేసుకున్నారు.


కోలీవుడ్‌ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ పెళ్లి సందడి మొదలైంది. ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో  షేర్‌ చేసుకున్నారు. వాటిలోని ఒక ఫొటోలో కాబోయే భర్త నికోలయ్‌ సచ్‌దేవ్‌ను ఆలింగనం చేసుకుంటూ కనిపించారు. ఈ ముందస్తు వివాహ వేడుక ముంబై జరిగినట్టు తెలిసింది. వీరిద్దరూ జులై 2న వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. దక్షిణాది సినీ సెలబ్రిటీల తో పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీని  ఇటీవల కలిసి పెళ్లికి ఆహ్వానించింది.



వరలక్ష్మి, నికోలయ్‌ శుభలేఖ అందించి, తమ వివాహానికి రావాలని ఆహ్వానించారు. శరత్‌ కుమార్‌ కుమార్తెగా వెండితెరకు పరిచయమైనా వరలక్ష్మీ బలమైన పాత్రలతో దూసుకెళ్తున్నారు. ‘క్రాక్‌’ తదితర చిత్రాల్లో నెగెటివ్‌ పాత్రలు పోషించి విశేషంగా అలరించారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త సచ్‌దేవ్‌తో దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో వీరిద్దరూ త్వరలో ఒకటి కాబోతున్నారు.

Updated Date - Jun 30 , 2024 | 08:43 PM