Varalaxmi: వరలక్ష్మి రిసెప్షన్.. బాలకృష్ణ, వెంకటేశ్, ఖుష్బూ హంగామా
ABN, Publish Date - Jul 04 , 2024 | 12:08 PM
క్రాక్ జయమ్మ ( వరలక్ష్మి) వివాహా రిసెప్షన్ బుధవారం రాత్రి చెన్నైలో నిర్వహించారు. ఈ వేడుకకు కొలీవుడ్ నుంచే కాక, బాలీవుడ్, టాలీవుడ్ నుంచి చాలామంది సెలబ్రిటీస్ హజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
క్రాక్ జయమ్మ ( వరలక్ష్మి) (Varalaxmi Sarathkumar)పెళ్లి నికోలాయ్ సచ్‌దేవ్(Nicholaisachdev)తో రెండు రోజుల క్రితం అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా బుధవారం రాత్రి చెన్నైలో వివాహా రిసెప్షన్ వేడుక నిర్వహించారు.
ఈ వేడుకకు కొలీవుడ్ నుంచే కాక, బాలీవుడ్, టాలీవుడ్ నుంచి చాలామంది సెలబ్రిటీస్ హజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
అయితే ఈ వేడుకలో అందరి కన్నా మన నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సెంట్రాఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. నాటి తారలతో హుషారుగా మాట్లాడుతూ, సెల్ఫీలు దిగుతూ బాగా సందడి చేశారు.
బాలకృష్ణ(Nandamuri Balakrishnaతో పాటుగా విక్టరీ వెంకటేశ్ (Venkatesh), దర్శకుడు మలినేని గోపీచంద్ (Gopichandh Malineni), సంగీత దర్శకుడు తమన్ (Thaman) కూడా ఈ వేడుకలోపాల్గొన్నారు.
ఈ సంందర్భంగా నటి ఖుష్బూ (Kushbhu) తన భర్త, ఇటీవలే బాక్ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సుందర్ (Sundar C) తో కలిసి బాలయ్య (Nandamuri Balakrishna), వెంకటేశ్ (Venkatesh), నటి శోభన (Shobana) లతో సెల్ఫీలు దిగి హంగామా చేసింది.
ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి.