మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Upasana Konidela: చరణ్‌ చూపే శ్రద్థ చూస్తే ముచ్చటేస్తుంది.

ABN, Publish Date - May 14 , 2024 | 04:10 PM

ప్రసవానంతర డిప్రెషన్‌ను అధిగమించడానికి తన భర్త రామ్‌చరణ్‌ (Ram charan) ఎంతో సాయం చేశారని ఉపాసన (Upasana) తెలిపారు.

ప్రసవానంతర డిప్రెషన్‌ను అధిగమించడానికి తన భర్త రామ్‌చరణ్‌ (Ram charan) ఎంతో సాయం చేశారని ఉపాసన (Upasana) తెలిపారు.  ప్రసవం తరువాత ఎదుర్కొన్న సవాళ్లను ఆమె చెప్పుకొచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘‘తల్లి కావడం అన్నది ప్రతి మహిళకు ఓ అద్భుతమైన ప్రయాణం. కానీ అది ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. ప్రసవానంతర డిప్రెషన్‌ను (Postpartum depression) ఏ మహిళ కూడా తక్కువగా తీసుకోవద్దు. అవసరమైతే నిపుణులను సంప్రదించి దాని నుంచి బయటపడాలి. చాలా మందిలాగే నేనూ డెలివరీ తర్వాత తీవ్ర ఒత్తిడికి లోనయ్యాను. అప్పుడు చరణ్‌ నాకు ఎంతో అండగా నిలిచాడు. నాతో పాటు మా పుట్టింటికి వచ్చాడు. అందరికీ ఇలాంటి అదృష్టం ఉండదు.

క్లీంకార (kilnaara)విషయంలోనూ చరణ్‌ చూపే శ్రద్థ చూస్తే ముచ్చటేస్తుంది. జీవితంలో నేను తల్లిగా ఎదుగుతున్న దశను చరణ్‌ మరింత సుసంపన్నం చేసినట్లు అనిపిస్తుంది. క్లీంకార ఎన్నో విషయాల్లో తన తండ్రిని  తలపిస్తుంది. తన ఆహారపు అలవాట్లు కూడా చరణ్‌లాగే ఉంటాయి’’ అని అన్నారు.


ప్రస్తుతం రామ్‌చరణ్‌ శంకర్‌ దర్శకత్వంలో 'గేమ్‌ ఛేంజర్‌' చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో జాన్వీ కపూర్‌ కథానాయిక.

Updated Date - May 14 , 2024 | 04:11 PM