Upasana: వాలెంటైన్స్ డే.. ఉపాసన పోస్ట్ వైరల్!
ABN, Publish Date - Feb 14 , 2024 | 11:17 AM
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ భార్య ఉపాసన గురించి పరిచయం అక్కర్లేదు. చరణ్ కు భార్యగా, మెగా కోడలిగా ఇంటి బాధ్యతలతోపాటు ఎంట్రప్రెన్యూర్ గా కూడా సొసైటీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ (Ram charan) భార్య ఉపాసన (Upasana) గురించి పరిచయం అక్కర్లేదు. చరణ్ కు భార్యగా, మెగా కోడలిగా ఇంటి బాధ్యతలతోపాటు ఎంట్రప్రెన్యూర్ గా కూడా సొసైటీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే ఆమె తరచూ ఏదో ఒక పోస్ట్‌తో అభిమానులకు అందుబాటులోఉంటారు. వాలెంటైన్స్ డేను పురస్కరించుకుని ఉపాసన తాజాగా పోస్ట్ చేసిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. తమ ముదుల కూతురు క్లీంకారాతో కలిసి రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఒకరి చేతిలో ఒకరు చేతులు వేసి ఉన్న ఫోటోను షేర్ చేసింది. లవ్ సింబల్ జతచేస్తూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు లవ్‌లీ కపుల్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రామ్ చరణ్, ఉపాసన 2010 నుంచి డేటింగ్‌లో ఉన్నారు. తదుపరి ఇరు కుటుంబాల అంగీకారం మేరకు జూన్ 14, 2012న వివాహం చేసుకున్నారు. గతేడాది పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆమెకు క్లీంకార అని నామకరణం చేశారు. బుధవారం వాలెంటైన్స్‌డే సందర్భంగా ఉపాసన అరుదైన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ప్రస్తుతం రామ్‌చరణ్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' చిత్రంలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్, బలమైన కథతో రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమా తర్వాత 'ఉప్పెన' ఫేం బుచ్చి బాబు సాన దర్శత్వంలో చరణ్ ఓ సినిమా చేయబోతున్నారు. త్వరలో సెట్స్ మీదకెళ్లనుందీ చిత్రం.