Upasana: ఐక్యతే మన బలం.. ఉపాసన
ABN, Publish Date - Nov 20 , 2024 | 05:44 PM
అయ్యప్ప దీక్షలోనే నటుడు రామ్ చరణ్ కడప దర్గా దర్శించుకున్న నేపథ్యంలో సర్వత్రా విమర్శలు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చరణ్ వైఫ్ విమర్శలకు రెస్పాండ్ అవుతూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..
ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశం 'కడప దర్గా'లో 'నేషనల్ ముషాయిరా గజల్' కార్యక్రమంతో పాటు వైభవంగా ఉరుసు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హీరో రామ్ చరణ్ అయ్యప్పమాలలో ఈ ఉత్సాహాలకి హాజరయ్యారు. దీంతో పలువురు రామ్ చరణ్‌ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. దీనిపై రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల స్ట్రాంగ్‌గా రియాక్టయ్యింది. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..
ఇటీవల పరమత సహనాన్ని చాటుతూ హీరో రామ్ చరణ్ అయ్యప్ప దీక్షలో ఉండగానే కడప దర్గాని దర్శించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలువురు అయ్యప్ప దీక్షలో ఉండగా దర్గాకి ఎలా వెళ్తారంటూ చరణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా సోషల్ మీడియాలో ఇది రచ్చ లేపింది. కాగా ఈ విమర్శలకు రామ్ చరణ్ సహచరిని ఉపాసన అసహనం వ్యక్తం చేస్తూ రెస్పాండ్ అయ్యారు. ఆమె తన 'X' ఖాతా ద్వారా.." మేము భారతీయులుగా అన్ని ధర్మాలని గౌరవిస్తాం. ధర్మం అనేది ఒకటి చేస్తుంది తప్ప ఎవరిని విడగొట్టదు. భారతీయత అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. చరణ్ దానినే అనుసరించాడు" అంటూ ఆమె పోస్ట్ చేశారు. దీంతో కొందరు హర్షం వ్యక్తం చేయగా మరికొందరు ఇంకా విమర్శిస్తున్నారు.
స్నేహితుడు ఏఆర్ రెహ్మాన్‌కి ఇచ్చిన మాట నిమిత్తం చరణ్ దర్గాకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఏఆర్ రెహ్మాన్ తన భార్య సైరా బాను మంగళవారం విడాకులు తీసుకున్నారు. ఇదే అదను అనుకోని చరణ్ విషయాన్ని ప్రస్తావిస్తూ రెహ్మాన్‌ని కూడా ట్రోల్ చేస్తున్నారు.