మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Upasana Konidela: నాన్న ముఖం చూస్తే నవ్వుతో వెలిగిపోతుంది! 

ABN, Publish Date - Feb 08 , 2024 | 11:35 AM

"ప్రతి మగాడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందని చెబుతుంటారు. అలాగే ఓ మహిళ సాధించే ప్రతి విజయం వెనుక రక్షణగా, అండగా నిలబడే మగాడు ఉంటారు. నాకు అలా రాంచరణ్‌ ఉన్నారు. పెళ్లైనప్పటి నుంచి ఆయన  ఇచ్చిన సపోర్ట్‌ మాటల్లో చెప్పలేను. నేను వేసే ప్రతి అడుగులోనూ ఆయన ఉన్నారు. నేను తలపెట్టిన ఏ పనినైనా   చాలా గొప్పగా భావిస్తారు’’ అని ఉపాసన కొణిదెల అన్నారు.

"ప్రతి మగాడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందని చెబుతుంటారు. అలాగే ఓ మహిళ సాధించే ప్రతి విజయం వెనుక రక్షణగా, అండగా నిలబడే మగాడు ఉంటారు. నాకు అలా రాంచరణ్‌ (Ram charan) ఉన్నారు. పెళ్లైనప్పటి నుంచి ఆయన  ఇచ్చిన సపోర్ట్‌ మాటల్లో చెప్పలేను. నేను వేసే ప్రతి అడుగులోనూ ఆయన ఉన్నారు. నేను తలపెట్టిన ఏ పనినైనా   చాలా గొప్పగా భావిస్తారు’’ అని ఉపాసన (Upasana) కొణిదెల అన్నారు. తాజాగా ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "నేను, రామ్‌చరణ్‌ వేర్వేరు కుటుంబాల నుంచి వచ్చాం అనుకుంటారు. కానీ ప్రతి అమ్మాయికి పెళ్లయ్యాక వెళ్లే ఇల్లు కొత్త ప్రపంచమే. మెట్టినింటికి వెళ్లాక వారు మనల్ని కోడలిగా కాకుండా కూతురిగా ఆహ్వానించేలా ఉంటాలి. అదృష్టవశాత్తు నా మెట్టినిల్లు నన్ను కూతురిగా భావిస్తుంది. మా ఇద్దరివి వేర్వేరు ఇండస్ట్రీ  ఫ్యామిలీస్‌ కావచ్చు. కుటుంబాల విషయానికొచ్చేసరికి ఒకటే బాధ్యత, ఒకటే భావోద్వేగం’’ అని ఉపాసన చెప్పారు. 

మొదట్లో ఇబ్బంది పడ్డా...

రామ్‌ చరణ్‌ రొమాంటిక్‌ సీన్స్‌ చేయడంపై  ఉపాసన చెబుతూ ‘‘మేమిద్దరం రెండు వేర్వేరు ప్రపంచాల నుంచి వచ్చాం. కానీ, నాతో ఉన్న కెమిస్ట్రీ  చరణ్‌కు మరొకరితో లేదు, ఉండదు కూడా. ఆయన హీరోయిన్స్‌తో   చేసే  సీన్స్‌ చూసి మొదట్లో ఇబ్బంది పడ్డా. అలా చేయడం అవసరమా? అని అడిగేదాన్ని. ‘ఇది నా వృత్తి ఇలాగే ఉంటుంది. నన్ను అర్థం చేసుకో’ అని వివరించేవారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం’’ అన్నారు. 

క్లీంకార నాన్న కూచినే...

తన బిడ్డ క్లింకారా గురించి చెబుతూ ుూతనని పెంచడంలో తల్లిదండ్రులుగా బాధ్యతలు పంచుకుంటున్నాం. పిల్లల విషయంలో అమ్మ చేేస దానికంటే నాన్న ఎక్కువ చేస్తారని భావిస్తాను. ఆడబిడ్డల విషయంలో అ యితే తండ్రి ఇంకొంచెం శ్రద్ధ వహిస్తారు. అందుకే ఆడపిల్లలు తండ్రిని ఎక్కువగా ప్రేమిస్తారు.  నా కూతురు విషయంలోనూ అంతే. తల్లిదండ్రులుగా ఇద్దరం మా బాధ్యతలు సమానంగా నిర్వర్తిస్తాం. ఆ ఫీలింగ్‌ చాలా బావుంది. కానీ, క్లీంకార నాన్న కూచినే. చరణ్‌ని చూడగానే తన ముఖం వెలిగిపోతుంది. చిరునవ్వులు చిందిస్తుంది. ఆ విషయంలో చరణ్‌పై నాకు అసూయ కలుగుతోంది’’ అని సరదాగా అన్నారు.

ప్రస్తుతం రామ్‌ చరణ్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘గేమ్‌ ఛేంజర్‌’లో నటిస్తున్నారు. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కియారా అడ్వాణీ కథానాయిక. ఈ చిత్రం పూర్తయిన తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్‌సీ 16 చేయబోతున్నారు రామ్‌ చరణ్‌.


Updated Date - Feb 08 , 2024 | 11:49 AM