Unstoppable 4: 'ఆహా' ఏం ప్లాన్ చేశారు.. బన్నీ తర్వాత పవన్ కళ్యాణ్
ABN, Publish Date - Oct 19 , 2024 | 01:23 PM
అన్ స్టాపబుల్ 4 ఫస్ట్ ఎపిసోడ్‌కు అల్లు అర్జున్ గెస్ట్‌గా రానున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెల్సిందే. పుష్ప 2 మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో పుష్ప టీమ్ గెస్ట్‌లుగా రానున్నారు. అయితే ఈ ఎపిసోడ్ షూట్ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. కాగా పుష్ప మూవీ డిసెంబర్‌లో రిలీజ్ కానుండటంతో ఈ ఎపిసోడ్‌ని మూవీ రిలీజ్ టైమ్‌లో విడుదల చేద్దామని ప్లాన్ చేశారట. దీంతో ఫస్ట్ ఎపిసోడ్ కోసం తెలుగు రాష్ట్రాలని ఏలుతున్న ఇద్దరు ప్రభుత్వాధినేతలను పిలుస్తున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరంటే..
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓటీటీ షో 'అన్‌స్టాపబుల్’ సీజన్ 4' (Unstoppable 4) స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. దీపావళి పండగని పురస్కరించుకొని తొలి ఎపిసోడ్ రిలీజ్ చేసేందుకు ప్రయ్నత్నాలు జరుగుతున్నాయి. అయితే అన్ స్టాపబుల్ 4 ఫస్ట్ ఎపిసోడ్‌కు అల్లు అర్జున్ (Allu Arjun) గెస్ట్‌గా రానున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెల్సిందే. పుష్ప 2 (Pushpa2TheRule) మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో పుష్ప టీమ్ గెస్ట్ లుగా రానున్నారు. అయితే ఈ ఎపిసోడ్ షూట్ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. కాగా పుష్ప మూవీ డిసెంబర్‌లో రిలీజ్ కానుండటంతో ఈ ఎపిసోడ్‌ని మూవీ రిలీజ్ టైమ్‌లో విడుదల చేద్దామని ప్లాన్ చేశారట. దీంతో ఫస్ట్ ఎపిసోడ్ కోసం తెలుగు రాష్ట్రాలని ఏలుతున్న ఇద్దరు ప్రభుత్వాధినేతలను పిలుస్తున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరంటే..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో నంద్యాల వైసీపీ అభ్యర్థి.. తన ఫ్రెండ్ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ట్వీట్ చేసి.. శిల్పా రవి ఇంటికి వెళ్లి మరీ విష్ చేయడాన్ని మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు మెగా, అల్లు కుటుంబాల ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. దీంతో ఇప్పుడు నంద్యాల విషయంపై బన్నీ ఏం చెప్పారనేది ఆసక్తికరంగా మారింది. పలువురు కామన్ ఫ్యాన్స్.. నంద్యాల వివాదాన్ని క్లోజ్ చేయాల్సిందిగా ఎప్పటి నుంచో అల్లు అర్జున్ ను కోరుతున్నారు. ఇప్పుడు అన్ స్టాపబుల్ వేదికగా వివరణ ఇచ్చి.. ఇక్కడితో వివాదాన్ని ముగించాలని అల్లు అరవింద్ ప్లాన్ చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉంటె 2024లో సార్వత్రిక ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ షోకి మరోసారి గెస్ట్‌గా రానున్నట్లు సమాచారం. అలాగే ఈ ఎపిసోడ్‌నే తొలి ఎపిసోడ్‌గా దీపావళి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుందట ఆహా. అయితే చంద్రబాబు నాయుడితో పాటు ఈ ఎపిసోడ్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న అఫిషియల్‌గా ఎలాంటి సమాచారం లేదు. కాగా సోషల్ మీడియా వేదికగా బన్నీ వర్సెస్ మెగా ఫ్యాన్స్‌గా నడుస్తున్న గొడవలకి ఈ షో ఏమైనా ఫుల్ స్టాప్ పెడుతుందా చూడాలి.