Big Boss Telugu: ఏమైంది రా.. అలా ఎలా ఇచ్చేశారు

ABN, Publish Date - Oct 25 , 2024 | 05:29 PM

ఈ వారం బిగ్‌బాస్‌ తీసుకున్న నిర్ణయాలకు ఆడియెన్స్ షాక్‌కి గురై తిట్టుకుంటున్నారు. ఎంతో కష్టపడిన కంటెస్టెంట్స్‌ని కాదని ఈజీగా మెగా చీఫ్‌ని నియమించాడు. ఇంతకీ అంత సునాయాసంగా మెగా చీఫ్ అయ్యిందేవరంటే..

బిగ్‌బాస్ హౌస్‌లో ఊహించని పరిణామం అందరిని షాక్‌కి గురి చేసింది. మెగా చీఫ్ కోసం నిఖిల్, పృథ్వీ, ప్రేరణ పడిన శ్రమ అంత బూడిదలో పోసిన పన్నీరైంది. దీంతో ఆడియెన్స్ షాక్‌కి గురై బిగ్‌బాస్‌ని తిట్టుకుంటున్నారు. ఇంతకీ అంత సునాయాసంగా మెగా చీఫ్ అయ్యిందేవరంటే..


ఈ వారం బిగ్‌బాస్.. మెగా చీఫ్ కోసం కంటెండర్లు అయ్యేందుకు దారుణమైన ఫిజికల్ టాస్క్ లు నిర్వహించాడు. ఈ టాస్క్స్ లో పృథ్వీ-నిఖిల్, రోహిణి, ప్రేరణ ఘోరంగా కష్టపడి కంటెండర్లుగా నిలిచారు. మరోవైపు ఓజీ క్లాన్ లో చివరివరకు నిలిచినా విష్ణుప్రియ కూడా కంటెండర్ గా నెగ్గింది. దీంతో వీళ్లకీ మళ్ళీ ఫిజికల్ టాస్క్ పెడతారని అంత అనుకున్నారు. కానీ.. ఇక్కడే బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. చీఫ్ కంటెండర్లు అందరినీ నిల్చోబెట్టి.. వాళ్లలో మెగా చీఫ్ అయ్యేందుకు అనర్హులని భావించిన వారి మెడలో దండేసి వీళ్లు అనర్హులని చెప్పేసి సరైన పాయింట్లతో రేసు నుంచి తీసేయాలని ఆదేశించాడు. దీంతో చివరికి నిఖిల్, విష్ణుప్రియ మిగిలారు. ఇక నిఖిల్ ఇప్పటికే మూడు సార్లు చీఫ్ అయ్యాడు కాబట్టి ఈసారి విష్ణుప్రియకి అవకాశం ఇచ్చారు కంటెస్టెంట్లు.


దీంతో ఎవరు ఊహించని విధంగా విష్ణుప్రియ మెగా చీఫ్ అయిపోయింది. ఈ సడన్ డిసిషన్ తోం ఆడియెన్స్ కాదు విష్ణుప్రియ కూడా షాక్ అయ్యింది. దీంతో విష్ణుప్రియ ఈ వారంతో పాటు వచ్చే వారం కూడా ఇమ్మ్యూనిటీ పొంది ఎలిమినేట్ కాకుండా సేవ్ అయ్యింది.

Updated Date - Oct 25 , 2024 | 06:08 PM