RGV: రాంగోపాల్ వర్మపై మరిన్ని కేసులు..
ABN, Publish Date - Nov 21 , 2024 | 06:15 PM
సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో పలు ఫిర్యాదుల మేరకు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
సోషల్ మీడియాలో (Social Media) అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో పలు ఫిర్యాదుల మేరకు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు సినీ దర్శకుడు రాంగోపాల్ (Ram Gopal Varma) వర్మపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు(Chandrababu naidu), జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌లపై(Pawan Kalyan) వర్మ అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూతో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగయ్య ఫిర్యాదుతో ఈ కేసు నమోదైన విషయం తెలిసిందే.
అయితే మేటర్ అక్కడితో ఆగలేదు. తాజా సమాచారం ప్రకారం వర్మపై మరిన్ని ఫిర్యాదులు అందుతున్నాయి. అనకాపల్లి, కడపలో ఆర్జీవీపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అనకాపల్లి జిల్లా రావికమతం పోలీసులకు ఆర్జీవీపై ఫిర్యాదు అందింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణకు రావాలంటూ వర్మకు నోటీసులు పంపించారు. దీనిపై స్పందించిన వర్మ తనకు వారం రోజుల సమయం కావాలంటూ తన తరుపు న్యాయవాదులతో పోలీసులు సందేశం పంపించారు. అలాగే కడప వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ లోనూ ఆర్జీవీపై ఫిర్యాదు అందింది. ఐ టీడీపీ నేతలు ఆర్జీవీపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్, వంగలపూడి అనితలపై ఆర్జీవీ అసభ్యకరమైన పోస్టులు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా పలు సందర్భాల్లో మహిళలను కించపరిచేలా అనేక పోస్టులు పెట్టారు ఫిర్యాదులో పేర్కొన్నారు.