Trisha - Vishwambhara: అందం మరింత అద్భుతంగా మారితే..!
ABN, Publish Date - May 04 , 2024 | 03:11 PM
'స్టాలిన్' వచ్చిన 18 ఏళ్ల తర్వాత మళ్లీ చిరంజీవితో కలిసి నటిస్తోంది త్రిష. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న 'విశ్వంభర’ చిత్రంలో చిరంజీవి సరసన నటిస్తోంది. ఫాంటసీ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని యువి. క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.
'స్టాలిన్' వచ్చిన 18 ఏళ్ల తర్వాత మళ్లీ చిరంజీవితో కలిసి నటిస్తోంది త్రిష(Trisha). వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న 'విశ్వంభర’(vishwambhara) చిత్రంలో చిరంజీవి (Chiranjeevi) సరసన నటిస్తోంది. ఫాంటసీ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని యువి. క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. శనివారం త్రిష పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ చిత్ర బృందం ఫస్ట్ లుక్ను విడుదల చేసింది. తాజా పోస్టర్లో త్రిష్ లుక్ అదిరిపోయేలా ఉంది. రెడ్ లెహంగాలో మెడలో భారీ ఆభరణాలతో ఎంతో అందంగా కనిపిస్తోంది త్రిష. అందం మరింత అద్భుతంగా మారితే ఇలాగే ఉంటుందేమో అన్నట్లుగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.
నేటితో త్రిష 41వ వసంతంలోకి అడుగు పెట్టింది. కథానాయికగా చిత్రరంగంలో అడుగుపెట్టి 22 ఏళ్ళు కావొస్తుంది. ఈ జర్నీలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఆమె దక్షిణాది అగ్ర హీరోలు అందరితో నటించింది. ఈ పోటీ ప్రపంచంలో యువతారలు ఎంతో మంది వస్తున్న నేపథ్యంలో 22 ఏళ్లుగా ఓ నాయిక అగ్ర స్థానంలో నిలవడం సాధారణ విషయం కాదు. త్రిష డెడికేషన్, ఆమె ఎంచుకున్న పాత్రలే ఆమెను ఈ స్థాయిలో ఉంచాయని చెబుతుందామె!