Tovino Thomas: తెలుగు హీరోల గురించి.. టొవినో ఏమన్నారంటే..
ABN, Publish Date - Sep 10 , 2024 | 01:06 PM
తనకు తెలిసిన తొలి తెలుగు హీరో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)అని మలయాళ నటుడు టొవినో థామస్ (Tovino Thomas) అన్నారు.
తనకు తెలిసిన తొలి తెలుగు హీరో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)అని మలయాళ నటుడు టొవినో థామస్ (Tovino Thomas) అన్నారు. చిన్నతనంలో ఆయన చూసిన తొలి తెలుగు చిత్రం 'జగదేకవీరుడు అతిలోక సుందరి’ అని, ఆ సినిమాకు పెద్ద అభిమానిని అని ఆయన చెప్పారు. టొవినో నటించిన తాజా చిత్రం ‘ఏఆర్‌యమ్’ (ARM-అజయంతే రంధం మోషణమ్). జితిన్ లాల్ దర్శకత్వంలో కృతిశెట్టి, ఐశ్వర్యా రాజేశ్ కథానాయికలుగా నటించారు. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో టొవినో తెలుగు హీరోల గురించి మాట్లాడారు. "నేను చూసిన తొలి తెలుగు చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. అలా చిరంజీవి గారు నాకు తెలిసిన తొలి తెలుగు హీరో. పదో తరగతి నుంచి అల్లు అర్జున్ సినిమాలు చూశా. అప్పట్లో ఆర్య చిత్రం చూశాను ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషన్స్ కోసం కొచ్చి వచ్చిన సమయంలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లను కలిశాను. వారితో కలిసి ప్రమోషన్స్‌లో పాల్గొన్న. వారంటే నాకు ఇష్టం. ఇక ప్రభాస్‌ని ఇష్టపడిన వారెవరుంటారు. ‘బాహుబలి’గా ఆయన్ను తప్ప మరొకరిని ఊహించుకోలేం. ఓ సారి ఆయన్ను కలిసి, మాట్లాడే అవకాశం వచ్చింది’’ అని అన్నారు.
సినిమా గురించి మాట్లాడుతూ ‘‘మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో చేస్తుండడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం మాకు డ్రీమ్ ప్రాజెక్ట్. 2017లో బీజం పడింది. దర్శకుడు జితిన్, రచయిత సుజిత్ నంబియార్ నన్ను కలిసి కథ చెప్పారు. త్రిపాత్రాభినయం చేయాలన్నారు. నటుడిగా అప్పటికి నాకు పెద్దగా అనుభవం లేదు. అందుకే మూడు పాత్రలు చేయడానికి ఆలోచించా. మూడు క్యారెక్టర్లు ప్లే చేయగలిగే గ్రేట్ యాక్టర్‌నని ఆ సమయంలో నేను అనుకోలేదు. తర్వాత నమ్మకం కలిగింది. తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంటుందో నిన్న హాజరైన ఓ ఈవెంట్‌తో తెలిసింది. టాలీవుడ్‌లో భాగం కావాలనుకుంటున్నా. ఇక్కడ సినిమాలు చేయాలని ఉంది. ఈసారి ఇక్కడకు వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడతా. కృతిశెట్టికి నా కుటుంబ సభ్యులు పెద్ద ఫ్యాన్స్. ఆమె నటించిన ‘బుల్లెట్’ సాంగ్‌ను మా పిల్లలు పదే పదే వింటుంటారు. కృతిశెట్టి టాలెంటెడ్ ఆర్టిస్ట్. చిన్న వయసైనా పరిణతితో ఆలోచిస్తుంటుంది. తను ఒక స్థాయికి వెళ్తుంది. ఈ మాట గుర్తుంచుకోండి’’ అని అన్నారు.