Tollywood: బ్యాచిలర్ లైఫ్‌కి బై.. ఆ స్టార్ ఎవరో తెలుసా

ABN, Publish Date - Nov 27 , 2024 | 11:09 AM

టాలీవుడ్ ప్రేక్షకులను ఎన్నో ఏళ్లుగా అలరిస్తూ ఎవర్ గ్రీన్ యాక్టర్ గా పేరు సంపాదించుకున్న 47 ఏళ్ల స్టార్ యాక్టర్ ఫైనల్‌గా పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ ఆయన ఎవరంటే..

ప్రస్తుతం టాలీవుడ్ పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఒక వైపు అక్కినేని ఫ్యామిలీ ఉత్సవాలతో పాటు మరికొందరు ఆర్టిస్టుల పెళ్లి వేడుకలతో వాతావరణం సందడిగా మారింది. అయితే టాలీవుడ్ ప్రేక్షకులను ఎన్నో ఏళ్లుగా అలరిస్తూ ఎవర్ గ్రీన్ యాక్టర్ గా పేరు సంపాదించుకున్న 47 ఏళ్ల స్టార్ యాక్టర్ ఫైనల్‌గా పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ ఆయన ఎవరంటే..


ఖడ్గం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న యాక్టర్ పెనుమత్స సుబ్బరాజు సంతోష్‌ అలియాస్ సుబ్బరాజు. 47 ఏళ్ళు వచ్చిన ఎప్పుడు పెళ్లి ప్రస్తావన తెచ్చిన ఆసక్తి లేదని చెప్పే ఆయన సైలెంట్‌గా పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేస్తూ అందరితో పంచుకున్నారు. దీంతో ఆయనకు ఫ్యాన్స్‌తో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలువుతున్నారు.


డైరెక్టర్ కృష్ణవంశీ ఇంటికి కంప్యూటర్ మెకానిక్ గా వెళ్లిన ఆయన యాక్టర్ గా బయటికొచ్చారు. ఆ తర్వాత వరుసగా పూరి జగన్నాధ్ సినిమాలతో పాటు టాప్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ నటిస్తున్నారు, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ భీమవరంలో పుట్టిన ఆయన ఇప్పటికి 100కు పైగా చిత్రాల్లో నటించారు. అయితే పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు, ఎక్కడ పెళ్లి చేసుకున్నారు అనే విషయాలు ఇంకా తెలియలేదు.

Updated Date - Nov 27 , 2024 | 11:10 AM