Tollywood: ఆన్'లక్కీ భాస్కర్' ఎవరో తెలుసా..

ABN, Publish Date - Nov 03 , 2024 | 07:33 PM

‘లక్కీ భాస్కర్’ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రం మొదటి షో నుండే పాజిటివ్ టాక్‌‌ని సొంతం చేసుకుని థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ సినిమాలో నటించే లక్కీ ఛాన్స్‌ని మిస్ చేసుకున్నాడు ఓ టాలీవుడ్ హీరో. ఇంతకీ ఆ ఆన్'లక్కీ భాస్కర్' ఎవరంటే..

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన హ్యాట్రిక్ చిత్రం ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రం మొదటి షో నుండే పాజిటివ్ టాక్‌‌ని సొంతం చేసుకుని థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ సినిమాలో నటించే లక్కీ ఛాన్స్‌ని మిస్ చేసుకున్నాడు ఓ టాలీవుడ్ హీరో. ఇంతకీ ఆ ఆన్'లక్కీ భాస్కర్' ఎవరంటే..


దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్కీ భాస్కర్‌’ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించారు. దీపావళి కానుకగా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిందీ ఈ చిత్రం. కథ, కథనం, దుల్కర్‌ నటన, సినిమా నడిచిన తీరును ప్రేక్షకులతోపాటు విమర్శకులు కూడా మెచ్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే రూ.12.7 కోట్లకు పైగా గ్రాస్‌ వసూలు చేసి ఈ సినిమా దీపావళి బ్లాక్‌ బస్టర్‌ గా నిలిచింది. అయితే దర్శకుడు వెంకీ అట్లూరి మొదట ఈ కథని నేచురల్ స్టార్ నానికి నేరేట్ చేశారట. ఈ కథ నానికి కూడా నచ్చేసింది. కానీ.. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నాని ఈ సినిమాని వదులుకోవాల్సి వచ్చింది. ఇక హిట్ మెషీన్ నాని మరో హిట్ మిస్ అయ్యాడని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ దీపావళికి రిలీజైన అన్ని సినిమాలు బ్లాక్‌బస్టర్‌లుగా నిలవడంతో టీఎఫ్ఐ (TFI fans) ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.


ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. 1990ల సమయం అది. భాస్కర్‌ కుమార్‌.. ముంబై మగధ బ్యాంక్‌లో క్యాషియర్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. మధ్యతరగతి కుటుంబం, చాలిచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. వస్తుందనుకున్న ప్రమోషన్‌ చేజారడంతో రూపాయి పెడితే రెండు రూపాయలు వచ్చే మార్గాలను ఎంచుకుంటాడు. తదుపరి అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌గా ప్రమోట్‌ అవుతాడు. మగధ బ్యాంక్‌లో ఆ జరిగిన స్కామ్‌ విచారణలో భాగంగా భాస్కర్‌ వ్యక్తిగత బ్యాంక్‌ అకౌంట్‌ చూసి అధికారులు షాక్‌ అవుతారు. నెలకు రూ. 19,500 జీతం తీసుకునే ఉద్యోగి అకౌంట్‌లో రూ.వంద కోట్లు వుంటాయి. అవి ఎలా వచ్చాయి. మగధ బ్యాంక్‌లో జరిగిన స్కామ్‌ ఏంటి? ఈ స్కామ్‌కి హర్ష్‌ మెహ్రాకి ఉన్న సంబంధం ఏంటి? చివరికి స్కామ్‌ నుంచి భాస్కర్‌ గట్టెక్కాడా? అన్నది కథ.

Updated Date - Nov 03 , 2024 | 07:33 PM